Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ముగిసిన గొల్లగట్టు జాతర..!

Suryapet : ముగిసిన గొల్లగట్టు జాతర..!

సూర్యాపేట, మనసాక్షి :

ఐదు రోజుల పాటు ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో మార్మోగిన పెద్దగట్టుజాతర గురువారంతో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటించారు. చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో కొలువైన శ్రీలింగమంతులస్వామి( పెద్దగట్టు) జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నాట్లు తెలిపారు.

తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన ఈ జాతర ఈ నెల 16వ తేదీన సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవరపెట్టె, సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మకర తోరణాన్ని పెద్దగట్టుకు తీసుకురావడంతో ప్రారంభమైన విషయం విదితమే. జాతరలో అత్యంత ముఖ్య ఘట్టమైన సౌడమ్మ తల్లికి బోనాల చెల్లింపు కార్యక్ర మాన్ని సోమవారం నిర్వహించారు. మంగళవారం చంద్రపట్నం, బుధవారం నెలవారం కార్యక్రమా లను చేపట్టారు.

గురువారం మకర తోరణాన్ని సూర్యాపేటకు తరలించడంతో జాతర ముగిసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా అధికారులు, ఆలయ పాలకవర్గం సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేశారని తెలిపారు.జాతర విజయవంతం కావడంలో అన్ని శాఖలు సమ న్వయంగా పని చేశాయన్నారు.

పోలీసు శాఖ అత్యాధునిక సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణను విజయవంతం గా నిర్వహించిందని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రజా రవాణాకు సమహకరించిందని తెలిపారు. వైద్యారోగ్యశాఖ ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించిందని,.పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ శాఖ, భక్తులకు తాగునీటికి ఇబ్బం దులు ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.

పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమన్వయంతో జాతర కవరేజీ నిర్వహించిందని జిల్లాలోని వివిధ పర్యాటక ప్రదేశాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకున్నాయన్నారు. జాతర విజయవంతంగా నిర్వహించడంలో అధికారులతో పాటు భక్తులు సహకరించారని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

MOST READ : 

  1. Power Shock : కాటేసిన కరెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత..!

  2. Suryapet : వారాబంది వట్టి మాటలేనా.. ఎండుతున్న పంటలు కాపాడుకునేందుకు రోడ్డెక్కిన రైతులు..!

  3. Suryapet : గొల్లగట్టులో అంగరంగ వైభవంగా నెలవార ఘట్టం.. దేవరపెట్టే కేసారం తరలింపు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!

మరిన్ని వార్తలు