Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతరలుజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : గొల్లగట్టులో అంగరంగ వైభవంగా నెలవార ఘట్టం.. దేవరపెట్టే కేసారం తరలింపు..!

Suryapet : గొల్లగట్టులో అంగరంగ వైభవంగా నెలవార ఘట్టం.. దేవరపెట్టే కేసారం తరలింపు..!

సూర్యాపేట, మనసాక్షి :

శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి వారి ఐదు రోజుల జాతర లో భాగంగా నాల్గవ రోజైన బుధవారం నెలవారం చేశారు. మూడవ రోజు చంద్రపట్నం వేసి శ్రీ శ్రీ శ్రీ లింగమంతుల స్వామి వారికి, మాణిచ్యమ్మ దేవి వారికి కళ్యాణం జరుపగా తదుపరి నాల్గవ రోజు నెలవార పట్నం మీద శ్రీ లింగమంతుల స్వామి, చౌడేశ్వరి అమ్మవారికి సంప్రదాయ పద్దతిలో మెంతేబోయిన వెంకన్న, మున్నా సందీప్ బోనం ఎత్తుకొన్ని చెల్లించారు.

గురువారం 5వ రోజుతో పెద్దగట్టు జాతర ముగియనున్నది. చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలి రానున్నారు. ఆదివారంతో ప్రారంభమైన ఈ జాతర గురువారం నాటితో ముగియనున్నది.

తదుపరి అమ్మవారికి నైవేద్యంను యాదవ పూజార్లు సమర్పించారు.స్వామివారికి నాలుగు రోజులుగా
లక్షలాది మంది భక్తులు చెల్లించుకున్నారని వారికి దిష్టి తగలకుండా చౌడేశ్వరి అమ్మవారి ముందు జంతుపూజ చేయటంతో నెలవారీ ఘట్టం ముగిసింది. తదుపరి దేవరపెట్టెను దురాజ్ పల్లి నుండి శివ సత్తుల విన్యాసాలతో, బేరిల చప్పులత్తో, ఓలింగా… నామస్మరణాలతో యాదవ పూజారులు కేసారంకు తరలించారు.

ఈ కార్యక్రమం లో దేవాలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్ , యాదవ పూజార్లు, కుల పెద్దలు, దేవాలయ కమిటీ పాలకవర్గం, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. వారికోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు..!

  2. Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!

  3. Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  5. Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

మరిన్ని వార్తలు