Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మేస్త్రీలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాదులోని మాదాపూర్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో ఈ శిక్షణ అందించనున్నారు. మొదటి దశలో 250 మంది మేస్త్రీలకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి శిక్షణను ఇచ్చి గ్రామీణ ప్రాంతాలకు పంపనున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులు శిక్షణ పొందిన మేస్త్రీలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నిర్మాణంలో ఇటుకలు, సెంట్రింగ్ మేస్త్రీల కొరత లేకుండా చూసేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మండలాలలో సిమెంటు ఇటుకల తయారీ, సెంట్రింగ్ సరఫరా కూడా ఆసక్తి ఉన్నవారికి అందించాలని.. వారిని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వారికి రుణాలు ఇచ్చి వారితో ఇటుకలు తయారీ చేయించి ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

MOST READ : 

  1. Bharosa : భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా..!

  2. Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

  3. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  4. Hyderabad : తీన్మార్ మల్లన్నకు షాక్..!

మరిన్ని వార్తలు