Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Bharosa : భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా..!

Bharosa : భరోసా సెంటర్‌ ద్వారా బాధిత మహిళలకు రక్షణ, భరోసా..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ కాలనిలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి హాజరైయ్యారు. సంవత్సర కాలంలో భరోసా సెంటర్లో మొత్తం 71 కేసులు నమోదు కాగా ఫోక్సో గ్రేవ్-51, నాన్ గ్రేవ్-09, రేప్ కేసులు-11 నమోదు చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని భరోసా కేంద్రం సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి, కేక్ కోసి భరోసా సెంటర్ టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి కేకును తినిపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని బాధిత మహిళలకు, అమ్మాయిలకు అండగా ఉంటూ వారికి నిరంతరం రక్షణ కల్పించాలని, బాధితులకు న్యాయపరమైన సూచనలు, కౌన్సిలింగ్ అందించి వీటితోపాటు భరోసా సెంటర్లు బాధితులకు నైపుణ్యాలను నేర్పించి వారికి సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడేలా చూడాలని భరోసా సెంటర్ టీం సభ్యులకు సూచించారు.

ఎస్పీ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు, బాలికలకు న్యాయం జరిగేలా చూడటం జరుగుతుంది అని భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించడానికి ఉన్నాయన్నారు. హింస మరియు లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలు ఇటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సెంటర్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు.

లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళాలకు లేదా బాలికలకు సంబందించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన సమయం నుండి బాధితులకు అండగా ఉంటూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ మరియు భరోసా సెంటర్ల గురించి అందరికీ అవగాహన కల్పిస్తు ఉండాలని భరోసా సెంటర్ సిబ్బందిని ఎస్పి సూచించారు.

ఈ కార్యక్రమంలో భరోసా డీఎస్పీ ఎన్ లింగయ్య, సిఐ లు శివ శంకర్, రామ్ లాల్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, డి పి ఆర్ ఓ. రషీద్, భరోసా సెంటర్ ఇంచార్జ్ ఎస్ఐ సునిత, కోఆర్డినేటర్ ప్రమీల, దేవి, డి సి పి యు. తిరుపతయ్య, చైల్డ్ లైన్ నరసింహులు, సఖి సెంటర్ సిబ్బంది రమాదేవి, కవిత, సిడబ్ల్యూసి కమల, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

  2. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  3. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సిఐ.. ఇద్దరు కానిస్టేబుల్స్..!

  4. Exams : తల్లిదండ్రులకూ.. పరీక్షా కాలమే..!

  5. District collector : ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ అభిషేకం.. మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశం..!

మరిన్ని వార్తలు