Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ అభిషేకం.. మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశం..!

District collector : ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ అభిషేకం.. మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశం..!

నల్లగొండ, మన సాక్షి :

మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ జిల్లా, పానగల్ సమీపంలో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 25 నుండి 27 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయమై మంగళవారం ఆమె ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.

బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఈ నెల 26న శివరాత్రి సందర్బంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, అంబులెన్స్, భారికేడింగ్, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, నలుగురు డాక్టర్లను అంబులెన్స్ తో సహా సిద్ధంగా ఉంచాలని, తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మహిళ కానిస్టేబుళ్లను ఎక్కువగా నియమించాలని, ప్రధాన రహదారి నుండి దేవాలయం వరకు పూర్తిస్థాయిలో లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

విద్యుత్ అధికారులు విరిగిపోయిన, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేసి విద్యుత్తు వల్ల ప్రమాదం జరగకుండా ఆడిట్ నిర్వహించాలని చెప్పారు. కోనేటితోపాటు, దేవాలయానికి వచ్చే రహదారికి ఇరువైపులా భారీ కేడింగ్ చేయించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పక్కనే ఉన్న తాగునీటి శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేసి నల్గొండ పట్టణానికి సరఫరా చేస్తున్న తాగునీటి వివరాలు, నీటి శుద్ధి వివరాలను మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వంశీకృష్ణ ద్వారా అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న జంతు జనన కేంద్రాన్ని సందర్శించి స్టీరిలైజేషన్ తదితర వివరాలను కనుక్కున్నారు. నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డిఎస్పి శివరామిరెడ్డి, సీఐ రాఘవేంద్రరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఆహార భద్రత అధికారి స్వాతి, తహసిల్దార్ శ్రీనివాస్, ఛాయా సోమేశ్వర దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలకృష్ణ ,తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

  2. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..!

  3. Devarakonda : ఎస్సైని అంటూ ఫోన్ చేసి టోకరా..!

  4. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!

  5. Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

మరిన్ని వార్తలు