Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..!

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..!

నల్లగొండ, మన సాక్షి:l :

నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు విలువరించింది. జులై 1, 2019న అర్ధరాత్రి పథకం ప్రకారం, భార్య, భర్తను ప్రియుడు అతని స్నేహితులతో కలిసి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులకు జీవిత ఖైదు జరిమానా విధించినట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన కేసులో నిందితులకు గౌరవనీయ ఫ్యామిలీ కోర్టు జడ్జి, దుర్గాప్రసాద్ జీవిత ఖైదు. 5000 ప్రతి సెక్షన్ కి మొత్తం 75000 జరిమానా చెల్లించడంలో విఫలమైతే (06) నెలల పాటు కఠిన జైలు శిక్ష విధించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

వివరాలలోకి వెళితే, నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గండవారిగూడెం రోడ్డు సమీపంలో సోమ కేశవులు భార్య స్వాతితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో స్వాతి, దుబ్బ ప్రదీప్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని, ఇట్టి అక్రమ సంబంధానికి భర్త కేశవులు అడ్డు వస్తున్నాడని ప్రియుడు దుబ్బ ప్రదీప్ అతని స్నేహితులైన కొడిదేటి శివకుమార్, కుంభం ప్రసాద్, చింతపల్లి నగేష్ లతో కలిసి ఎలాగైనా భర్తను హతమార్చాలని పథకం ప్రకారం భర్త సోమ కేశవులను సుత్తితో చాతి పైన కొట్టి, ఆధారాలు రూపుమాపాలని ఉద్దేశంతో నేరపూరితంగా అంతమొందించారు.

మృతుని తండ్రి సోమ నాగులు ఇచ్చిన పిర్యాదు మేరకు నిందితులపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం సరి అయిన ఆధారాలు కోర్టుకి సమర్పించగా, విచారణ అనంతరం నిందితులకు జీవిత ఖైదు జరిమానా విధించి మహిళను నిందితులను జిల్లా జైల్ నల్గొండకు తరలించనైనది.

ఈ కేసులో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టుకి అందజేసి నిందితుని శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిగిడాల సురేష్, నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్, ప్రస్తుత నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి, ప్రస్తుత నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రాస్క్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి జవహర్ లాల్,వి శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్, బి వెంకటేశ్వర్లు పోలీస్ కానిస్టేబుల్ లైసెనింగ్ ఆఫీసర్స్ హెడ్ కానిస్టేబుల్ పి.నరేందర్, పిసి ఎన్.మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డ్ అందచేస్తామన్నారు.

MOST READ : 

  1. Phonepe : ఫోన్ పే లో కొత్త ఫీచర్.. మోసాన్ని నివారించవచ్చు..!

  2. TG News : 14 నెలల్లో 35 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. 35 పైసలు కూడా తీసుకురాలేదు..!

  3. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!

  4. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

మరిన్ని వార్తలు