తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Penpahad : ఎండుతున్న వరి పంటలు.. సాగు నీటి కోసం రైతుల అరిగోస..!

Penpahad : ఎండుతున్న వరి పంటలు.. సాగు నీటి కోసం రైతుల అరిగోస..!

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో పలు గ్రామాలలో వరి పంటలు ఎండుతున్నాయి. వారబంది వల్ల పంటలు ఎండిపోతున్నాయి. సాగునీటి కోసం రైతులు అరిగోశ పడుతున్నారు.

పెన్ పహాడ్ మండలం లోని గాజుల మల్కాపురం రెవిన్యూ పరిధిలోని చిన్న గ్యారకుంట గ్రామ పంచాయితి గిరిజన రైతులు వేసిన వరి పంటకు ఎస్ ఆర్ ఎస్ పి కాలువ ద్వారా నీరు రాక పోవడం వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయి.

ఎస్సారెస్పీ కాలువలలో నీళ్లు రాక పొలాలు ఎండి భూములు నెర్రెలు పారుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాలేశ్వరం నుంచి వచ్చే నీరుతో గతంలో పంటలు పండినాయని అదే తరహాలో నీరు వస్తుందని రైతులు ఆశతో నాట్లు పెట్టారు. వారాబంది ప్రకారం నీరు ఇస్తామని ప్రభుత్వం చెపుతున్న అది సాధ్యం కావడం లేదు.

ఎండిపోయిన పొలాలను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వేంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీరు ఇచ్చి పంట పొలాలను కాపాడాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గుంజ వెంకటేశ్వర్లు, రైతులు ధార్వాత్ నాగేష్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీ, వీరన్న, తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్..!

  3. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

  4. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

  5. District collector : ఇందిరమ్మ ఇండ్ల పనుల గ్రౌండింగ్ పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్..!

మరిన్ని వార్తలు