TG News : ముదురుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు..!
TG News : ముదురుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు..!
నీరు అందక నెర్రెలు వారుతున్న పొలాలు..
బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరం..
మన సాక్షి :
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలో ఇంకా వేసవి మొదలు కాక ముందే ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గం అయినా భీంగల్, వేల్పూర్, మండలాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఎక్కువ శాతం బోరుబావుల కింద పంటలను సాగు చేయగా, సరిగ్గా నీరందించలేకపోవడంతో వరి చేను ఎండుముఖం పడుతున్నాయి. ఆరు నెలల శ్రమంతా వృథా అవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి ఆశలపై దెబ్బ..
వానాకాలం సీజన్ లో భారీ వర్షాలతో చెరువులు కుంటలు నిండి పొంగిపొర్లాయి. అతివృష్టితో కొన్ని ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లి చేతికి రాకుండా నేలపాలైంది. చెరువులు, కుంటలను జలకళను
సంతరించుకోవడంతో రైతులు యాసంగిపై ఆశలు
పెంచుకున్నారు. వరి సాగు వైపు మొగ్గు చూపారు. అయితే ఫిబ్రవరి మొదటివారం నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటిపోతున్నాయి.
బోర్లు నీరు ఇంకిపోతున్నది. దీంతో వరికి సరిపడా నీరందించలేక రైతులు అల్లాడుతున్నారు. పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు వ్యవసాయ బావుల్లో పూడికతీతను చేపట్టారు. మరికొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చేసేదేమీ లేక నెర్రెలువారిన చేనులో పశువులను మేపుతున్నారు.
Reporting : Pranay
Nizamabad (Bhemgal)
MOST READ :
-
BIG BREAKING : నేటి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్.. ఎందుకంటే..!
-
Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!
-
Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!









