Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!

Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా వెంటనే రాష్ట్రంలో ఏడు ఉమ్మడి జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రక్రియ ఆగిపోయింది.

ఆ తర్వాత ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆలస్యమైంది. ఇది ఇలా ఉండగా నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది.

ఇప్పటికే రాష్ట్రంలో 89.90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కాగా మరో 2.50 లక్షల రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన, దరఖాస్తులతో పాటు గ్రామ సభలు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. కాగా

కొత్త దరఖాస్తులతో పాటు పాతగా ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గాను అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నట్లుగా ప్రభుత్వం భావించి ఇంటింటికి రేషన్ కార్డుల పై మరోసారి పరిశీలన చేసే అవకాశం ఉంది.

సొంత ఇల్లు, కారు, అంతస్తుల భవనాలు, ఆస్తులు ఉన్నవారికి కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దాంతో అలాంటి వారికి రేషన్ కార్డులను తొలగించి పేదలకు, నిజమైన అర్హులకు తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

  2. TG News : తెలంగాణలో మహిళలకు కుటుంబ భరోసా కు రూ.10 లక్షలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన..!

  3. Job mela : మార్చి 12న జాబ్ మేళా నిర్వాహణ..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!

  5. Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలీడేస్.. ఉత్తర్వులు జారీ..!

మరిన్ని వార్తలు