Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Grievance : గ్రీవెన్స్ లో ఏరీ.. వీరు..!

Grievance : గ్రీవెన్స్ లో ఏరీ.. వీరు..!

నేలకొండపల్లి, మన సాక్షి :

ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ ఇక్కడ అపహస్యం చేస్తున్నారు. తమకు సంబంధం లేదన్నట్లుగా గ్రీవెన్స్ వైపు కన్నెత్తికూడ చూడటం లేదు…దీంతో మండల అధికారులు కూడ మొక్కుబడిగా మమ అనిపిస్తున్నారు.

మరి కొంత మంది అధికారులు తమ కింద సిబ్బందిని పంపించి చేతులు దులుపుకుంటున్నారు…
స్థానిక తహశీల్ కార్యాలయంలో ప్రతీ సోమవారం జరిగే గ్రీవెన్స్ మండల ప్రజలను వెక్కిరిస్తుంది. కారణం ప్రభుత్వం కు జరిగే గ్రీవెన్స్ మండల ప్రజలను వెక్కిరిస్తుంది. కారణం ప్రభుత్వం కు చెందిన అన్ని శాఖల అధికారులు హజరు కాకపోవటం.

కేవలం తహశీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ, ట్రాన్స్కో, ఐసీడీఎస్ మండల స్థాయి అధికారులు మాత్రమే హజరువుతున్నారు. ఇక ఇరిగేషన్ ఒక లష్కర్ ను, విద్య శాఖ ఓ సీఆర్పీ, వైద్య శాఖ హెచ్ఐవో ఇలా ప్రతీ శాఖ అధికారులు కేవలం వారి కింద స్థాయి సిబ్బంది ని పంపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో మండలం లోని బైరవునపల్లి కి చెందిన రైతులు రహదారి ఆగిపోయింది…. తాము ఇబ్బంది పడుతున్నామని ..ఆర్అండ్్బ అధికారుల పై ఫిర్యాదు చేశారు. కానీ వివరణ ఇచ్చేందుకు సంబంధిత అధికారులు మాత్రం లేరు. దీంతోఇక్కడ ఇవ్వటం కన్నా… కలెక్టర్ కార్యాలయం లో ఇవ్వటం మంచిదని రైతులు వాపోయారు.

ఇలా ప్రతీ శాఖ అధికారుల తీరు ఇలానే ఉంది. కేవలం మొత్తం కూడ పట్టుమని పది మంది అధికారులు లేరంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అగ్నిమాపక శాఖ, అటవీశాఖ, ఆర్అండ్్బ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యా శాఖ, ఎక్సైజ్, పోలీస్ తదితర శాఖల అధికారులు గ్రీవెన్స్ వైపు కన్నెత్తి చూడటం లేదని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా కింది స్థాయి సిబ్బంది కాకుండా అధికారులు హజరు కావాలని.. అదే విధంగా అన్ని శాఖల అధికారులు హజరైతేనే కలెక్టర్ ఆశయం సిద్ధిస్తుందని పలువురు బాధితులు వాపోతున్నారు. మండల అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

MOST READ : 

  1.  Additional collector : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశం..! 

  2. Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!

  3. District collector : LRS ఫీజులు 25% రాయితీ.. సద్వినియోగం చేసుకోండి.. జిల్లా కలెక్టర్..!

  4. Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు