Cyber : సైబర్ మోసగాడికే చుక్కలు చూపించిన యువకుడు.. ఎలాగో అందరూ తెలుసుకోండి..!
Cyber : సైబర్ మోసగాడికే చుక్కలు చూపించిన యువకుడు.. ఎలాగో అందరూ తెలుసుకోండి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తికే ఓ యువకుడు చుక్కలు చూపించాడు. ఈ సంఘటన కాన్పూర్ లో చోటుచేసుకుంది.
కాన్పూర్ కు చెందిన భూపేంద్ర సింగ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాను సిబిఐ అధికారిని నా దగ్గర మీ అశ్లీల వీడియోలు ఉన్నాయి. ఈ విషయంపై కేసు పెడితే మీరు చాలా సంవత్సరాలు జైల్లో ఉంటారు అని బెదిరించాడు. అయితే అది ఒక మోసగాడు నుంచి కాల్ వచ్చిందని భూపేంద్ర సింగ్ అర్థం చేసుకున్నాడు.
కానీ దయచేసి ఆ వీడియోని విడుదల చేయవద్దు అంటూ బ్రతిమిలాడినట్లు నటించాడు. ముఖ్యంగా తన తల్లికి చెప్పొద్దంటూ వేడుకున్నాడు. ఇది విన్న ఆ మోసగాడు 16,000 చెల్లిస్తే ఈ కేసును మూసేపిస్తాను అంటూ నమ్మబలికాడు.
దాంతో భూపేంద్ర సింగ్ ఓ పథకం ప్రకారం మా అమ్మ బంగారు గొలుసు తాకట్టు పెట్టబడింది దాన్ని పునరుద్ధరించడానికి 3000 రూపాయలు ఖర్చవుతుంది. అవి నాకు పంపితే నేను బంగారు గొలుసు తిరిగి తీసుకొని వచ్చి నీకు డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. అయితే సైబర్ మోసగాడు భూపేంద్ర సింగ్ మాటలు నమ్మి 3 వేల రూపాయలు పంపించాడు.
మళ్లీ కొన్ని నిమిషాల తర్వాత భూపేంద్ర మాట్లాడాడు. 3000 రూపాయలు సరిపోవడం లేదు వడ్డీ వ్యాపారి తనకు ఇంకా 4480 రూపాయలు అవసరం అని చెప్పాడని సైబర్ మోసగానికి చెప్పాడు. ఆ బంగారం గొలుసు విలువ 50 వేల రూపాయలు ఉంటుంది. ఈ డబ్బులు పంపితే నేను మొత్తం డబ్బులు మీకు పంపిస్తాను అని చెప్పాడు
అయితే ఉపేంద్ర సింగ్ మాటలు నమ్మిన సైబర్ మోసగాడు 4480 పంపాడు. ఆ తర్వాత భూపేంద్ర సింగ్ స్పందించలేదు. సైబర్ మోసగాడు భూపేంద్రను సంప్రదించి దయచేసి నా డబ్బులు తిరిగి ఇవ్వండి అని వేడుకున్నాడు. కానీ భూపేంద్ర వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి మోసగాడి నుండి అందుకున్న డబ్బులు పోలీసులకు అప్పగించాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది.
MOST READ :
-
Gold Price : పసిడి సరికొత్త రికార్డు.. తులం ఎంతంటే..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!









