Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!

Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ భారీ శుభవార్త తెలియజేసింది. బడ్జెట్ లో రైతు భరోసా కు నిధులు కేటాయిస్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలు అందజేసేందుకు రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టింది.

గత ప్రభుత్వ రైతుబంధు పథకంలో అవకతవకలను తొలగించి రైతు భరోసాను పకడ్బందీగా సాగు చేసిన రైతులకే అందించేందుకు రూపొందించింది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో రైతు భరోసా పథకానికి 18 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో 24,439 కోట్ల రూపాయలను కేటాయించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు వారి వారి ఖాతాలలో డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 44.82 లక్షల మంది రైతులకు 3,487.82 కోట్ల రైతు భరో సన్నిధిలో అందజేశారు. జనవరి 26న పైలట్ ప్రాజెక్టుతో పాటు ఇప్పటివరకు 4 విడతలుగా రైతు భరోసా పథకానికి నిధులు విడుదల చేసింది.

కాగా మిగతా రైతులు కూడా రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బడ్జెట్ లో రైతు భరోసాకు 18 వేల కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల రైతులందరికీ మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో రైతు భరోసా అందనున్నది.

MOST READ : 

  1. District collector : మఖాన సాగు పై రైతులు దృష్టి సారించాలి.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

  2. TG News : మహిళలకు తులం బంగారం.. నెలకు రూ.2500లపై బిగ్ అప్డేట్..!

  3. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  4. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

  5. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు