Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

UPI : డిజిటల్ పేమెంట్స్ లో మోసాలకు చెక్..!

UPI : డిజిటల్ పేమెంట్స్ లో మోసాలకు చెక్..!

హైదరాబాద్, మన సాక్షి :

డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా జరిగే లావాదేవీలన్నింటిలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తుంది.

అందులో భాగంగా వినియోగదారుల నుంచి వ్యాపారులు డబ్బు వసూలు చేసుకునేందుకు అమలవుతున్న కలెక్ట్ / ఫుల్ రిక్వెస్ట్ పద్ధతిని దశలవారీగా నిలిపివేయాలని భావిస్తుంది. ఈ విషయంపై ఎన్పీసీఐ బ్యాంకులు ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతోంది.

ఎలా అంటే ..?

మీరు ఒక షాపింగ్ చేశారనుకుంటే.. అక్కడ షాపింగ్ పూర్తయ్యాక బిల్ చెల్లించే సమయంలో యూపీఐ తో లింక్ అయి ఉన్న మీ ఫోన్ నెంబర్ అడుగుతారు. మీరు చెప్పిన యూపీఐ యాప్ లోకి లేదా మెసేజ్ రూపంలో ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా కలెక్ట్ / ఫుల్ రిక్వెస్ట్ పంపిస్తారు. దాన్ని మీరు క్లిక్ చేసి యూపీఐ పిన్ నమోదు చేస్తే చెల్లింపు జరుగుతుంది. దాంతో వినియోగదారుల అనుమతితో డబ్బులు మన ఖాతా నుంచి డెబిట్ చేసుకుంటారు.

అయితే ప్రతిసారి చెల్లింపులు చేయాల్సి ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకునే ఆటో డెబిట్ లాంటి ఏర్పాటన్నమాట. ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు వినియోగదారుల నుంచి డబ్బు గుంజుతున్నారు. ఇలాంటి సంఘటనలు పెరిగాయి. దాంతో ఆర్థిక భద్రతను మెరుగుపరిచేందుకు ఎన్ పీసీఐ ఈ నిర్ణయం తీసుకోనున్నది.

ప్రత్యామ్నాయం ఏంటి..?

ఫుల్ లావాదేవీలను తొలగిస్తే వినియోగదారులు పుష్ విధానాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అదేంటంటే వినియోగదారులు వారి ఖాతాల నుంచి స్వయంగా డబ్బులు వ్యాపారులకు పంపించాలి. అంటే మనం ఎవరికైనా డబ్బు పంపాల్సి ఉన్నప్పుడు వారి ఫోన్ నెంబర్ తీసుకొని దానికి మనం పంపడం గాని లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపు చేయడం గాని సురక్షితమైన మార్గాలుగా ఉంటాయి.

అందువల్ల మోసపూరిత లావాదేవీల సంఖ్య తగ్గుముఖం పట్టనున్నది. ఫుల్ కలెక్ట్ / రిక్వెస్ట్ లావాదేవీలను తొలగిస్తే ఆటో డెబిట్ రికరింగ్ చెల్లింపులపై ప్రభావం పడే అవకాశం ఉంది అందుకు ప్రత్యామ్నాయంగా NPCI కొత్త పద్ధతిని తీసుకువచ్చే అవకాశం ఉంది.

Similar News : 

  1. UPI : తప్పు నెంబర్ కు యూపీఐ డబ్బులు పంపించారా.. అయితే ఇలా చేయండి..!
  2. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!

మరిన్ని వార్తలు