Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!

Gold Price : వరుసగా పడిపోయిన బంగారం ధర.. కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర తగ్గు ముఖం పట్టింది. ఐదు రోజులుగా వరుసగా ధర తగ్గుతుంది. మార్చి 21వ తేదీ నుంచి ప్రతిరోజు కొంతమేరకు పసిడి ధర తగ్గుతుంది. ఏప్రిల్ మాసంలో శుభకార్యాలు ఉన్నందున పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్ గా భావిస్తున్నారు. మహిళలు బంగారం భారీగా కొనుగోలు చేస్తున్నారు.

100 గ్రాముల బంగారంకు మంగళవారం ఒక్కరోజే 3300 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం సోమవారం 8,96,200 రూపాయలు ఉండగా 3300 రూపాయలు తగ్గి 8, 92,900 రూపాయలకు చేరింది.

హైదరాబాదులో తులం ఎంతంటే..?

హైదరాబాదులో తులం బంగారం (10 గ్రాములకు) 24 క్యారెట్స్ మంగళవారం 89,290 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం 81,850 రూపాయలు ఉంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మార్చి 21 నుంచి తగ్గుదల :

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మార్చి 21వ తేదీ నుంచి తగు ముఖం పట్టాయి. మార్చి 20వ తేదీన 24 క్యారెట్స్ బంగారం కు 90,660 రూపాయలు ఉండగా వరుసగా తగుముఖం పట్టడంతో ప్రస్తుతం 89,290 ఉంది.

Similar News : 

  1. Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
  2. Gold Price : పసిడి సరికొత్త రికార్డు.. తులం ఎంతంటే..!
  3. Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!
  4. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!

మరిన్ని వార్తలు