TOP STORIESBreaking Newsవ్యవసాయంహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం 4 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలలో నిధులు జమ చేసింది.

గత ప్రభుత్వం రైతు భరోసా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10 వేల రూపాయలను అందించేది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12,000 అందజేస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఎకరాల లోపు ఉన్న 54.74 లక్షల మంది రైతులకు 77.78 లక్షల ఎకరాలకు గాను 4666.60 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది.

కాగా కొంతమంది రైతులకు ఎకరం లోపు ఉన్నా కూడా రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ కాలేదు. అదే విధంగా కొత్తగా పొట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమకాలేదు. వీరి కోసం ప్రత్యేకంగా మండల వ్యవసాయ కార్యాలయాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

కాగా రైతులు కూడా ఒకసారి పట్టాదారు పాసుబుక్ తో పాటు బ్యాంకు ఖాతాను సరిచేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతా ఈకేవైసీ అయిందో కాలేదో కూడా చూసుకోవాలని చెబుతున్నారు. అన్ని సరిగా ఉంటే పట్టాదారు పాస్ పుస్తకం తో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు జిరాక్స్ ను అధికారులకు అందజేస్తే రైతులకు రైతు భరోసా వారి ఖాతాలలో జమకానున్నది.

MOST READ :

మరిన్ని వార్తలు