WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!
మన సాక్షి :
వాట్సప్ మెసేజింగ్ యాప్ ప్రపంచంలో అత్యధిక మంది వినియోగిస్తున్నారు. చాలా ఈజీగా వీడియోస్, ఫోటోలు, సమాచారం అతి తొందరగా చేరవేసే మెసేజింగ్ యాప్ వాట్సప్. అత్యధిక మంది వినియోగిస్తున్న యాప్ కూడా వాట్సప్ అని చెప్పుకోవచ్చును. అయితే ఎప్పటికప్పుడు వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.
ఇంకా కొత్త యూజర్లను ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది. అయితే సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. స్టేటస్ లో పెట్టే ఫోటోలకు పాటల్ని జోడించే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీన్ని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం…
ఇన్ స్టాగ్రామ్ స్టోరీ అప్లోడ్ చేసేటప్పుడు పోస్ట్ కు తగ్గట్టుగా మనకు నచ్చిన పాటను ఎంచుకొనే అవకాశం ఉంటుంది. అలాగే తాత్కాలిక మ్యూజిక్ క్లిప్పులను జోడించే అవకాశం కూడా వాట్సప్ కూడా ప్రవేశపెట్టింది. ఇన్ స్టాగ్రామ్ లాగానే ఇకపై స్టేటస్ లో 24 గంటల పాటు కూడా ఫోటోలు, టెక్స్ట్, వీడియోలకు కూడా పాటలను జోడించే అవకాశం కల్పించింది. ఇప్పటికే చాలామందికి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
ఎలా అంటే..!
వాట్సాప్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోగానే యాడ్ స్టేటస్ ఆప్షన్ పై క్లిక్ చేసి గ్యాలరీలో మీకు నచ్చిన ఫోటో గాని వీడియో గాని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దానిని సెలెక్ట్ చేయగానే క్రాప్, స్టిక్కర్స్, టెక్స్ట్, ఎడిట్ ఆప్షన్లు స్క్రీన్ పై కనిపిస్తాయి. వాటి ముందే మ్యూజిక్ ఐకాన్ కొత్తగా కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన పాటను ఎంచుకోవచ్చు.
అయితే ఇలా ఫోటో కోసం 15 సెకన్లు, వీడియో కోసం 60 సెకన్ల వరకు పాటను ఎంచుకోవచ్చు. పాట ఎక్కడి నుంచి ప్లే కావాలని కోరుకుంటున్నారో అలా అడ్జస్ట్ కూడా చేసుకునే అవకాశం వాట్సప్ కల్పించింది. ఇక స్టేటస్ అదిరిపోయేలా ఉంటుంది.
MOST READ :
-
Fighting : టీచర్, అంగన్వాడి వర్కర్ ఫైటింగ్.. వీడియో వైరల్..!
-
Electricity Bill : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జారీ చేసిన CMD..!
-
Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!
-
TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!









