TOP STORIESBreaking Newstravelహైదరాబాద్

Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

Hyderabad : ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు ఊరట కలిగించే శుభవార్త చెప్పబోతోంది. ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో గాని మెట్రోలో గాని ప్రయాణం చేస్తుంటారు. అయితే వారికి ప్రభుత్వం శుభవార్త అందించే అవకాశం ఉంది. దాంతో ఆర్టీసీ బస్సు, మెట్రో రైల్లో ప్రయాణం చేసే వారికి ఊరట కలగనున్నది.

తెలంగాణ ప్రభుత్వం (టి మాస్) తెలంగాణ మొబిలిటీ యాజ్ఞ ఏ సర్వీస్ కింద కామన్ మెబిలిటీ కార్డును ప్రారంభించనున్నది. దీనిని హైదరాబాద్ మెట్రో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలలో ఈజీగా ప్రయాణికులు ఒకే కార్డును ఉపయోగించుకునేలా చేస్తుంది.

అయితే ఇది ఆర్టీసీ ఎంపిక చేసిన బస్సులలో టాప్ యంత్రాలను పరీక్షించడం ద్వారా ట్రావెల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ యంత్రాలు ప్రయాణికులు ఎక్కేటప్పుడు వారి మెబులిటీ కార్డును ట్యాప్ చేయడానికి వీలు కల్పిస్తాయి. దీంతో టికెట్ల అవసరాన్ని తొలగించడం, దాంతోపాటు లావాదేవీల సమయం కూడా తగ్గనున్నది.

అయితే హైదరాబాద్ మెట్రో ఇప్పటికే కామన్ మెబిలిటీ కార్డును ఉంచగల టికెట్ స్కానర్లను కలిగి ఉంది. అయితే వీళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు కొత్తగా సేవలు లాంచ్ చేయాల్సిన అవసరం రాదు.

మెట్రో సేవలు :

హైదరాబాద్ లో మెట్రో సేవలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాత్రివేళ 11 గంటల నుండి 11:45 గంటల మధ్య చివరి మెట్రో రైలు బయలుదేరుతుంది. ఆదివారాల్లో ప్రజలు సర్వీసులు టెర్మినల్ స్టేషన్ ల నుండి ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయని ఎల్ అండ్ టి మెట్రో ప్రకటించింది.

అదేవిధంగా మెట్రో స్టూడెంట్ పాస్ ను కూడా మరో ఏడాది వరకు పొడిగించింది. విద్యార్థుల పాస్ తో 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు పొందే అవకాశం ఉంది. కొత్త సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఊరట లభించనున్నది. ఒకే కార్డు ద్వారా అటు ఆర్టీసీలో ఇటు మెట్రోలో ప్రయాణం చేయవచ్చును.

MOST READ :

  1. Nalgonda : పల్లెనిద్రలో ASP.. కేసులు, చట్టాలు, విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ పట్ల అవగాహణ..!

  2. Miryalaguda : నల్లమల అడవుల్లో ఒక రోజు.. మిర్యాలగూడ విద్యుత్ ఉద్యోగులు..!

  3. Childrens Death Case : గెట్ టు గెదర్ ఎంత పని చేసింది.. పెరుగన్నం తినకుండా బతికిపోయిన చంద్రయ్య..!

  4. వివాహిత మహిళలే వారి లక్ష్యం.. అత్యాచార నిందితులు మామూలోళ్లు కాదు..!

  5. Traffic : మీ బండ్లకు, కార్లకు ఈ చలాన్లు చెల్లించడం లేదా.. అయితే భారీ షాక్.. కొత్త పెనాల్టీలు..!

  6. Groups : ఆర్టీసీ ఉద్యోగుల కూతుళ్ళు.. డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపిక..!

మరిన్ని వార్తలు