Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : భూభారతి చట్టంపై 17 నుంచి విజ్ఞాపనలు స్వీకరణ.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

District collector : భూభారతి చట్టంపై 17 నుంచి విజ్ఞాపనలు స్వీకరణ.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు, రెవిన్యూ గ్రామాల్లో ఈనెల 17వ తేదీ నుంచి రెవిన్యూ టీం లు సందర్శించి ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో తాసిల్దారులు, ఆర్ ఐ లతో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని పైలెట్ ప్రాజెక్టుగా మొట్టమొదటిసారిగా జిల్లాలో ని మద్దూరు మండలాన్ని ఎంపిక చేసిందని అన్నారు. ఈ మండలంలో భూనిర్వాసితులు వారి సమస్యలను తీర్చుటకు రెవెన్యూ సిబ్బందికి ప్రతి ఒక్కరు భూములకు సంబంధించిన దస్తావేజులు అన్ని డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోవాలని తెలిపారు.

ఈనెల17 నుంచి రెవిన్యూ టీం లు ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులపై గ్రామ సదస్సులను నిర్వహించి భూ భారతి చట్టం ప్రకారం అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈనెల 17న మద్దూరు మండలానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై చట్టాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ బెన్ శాలం, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత గంగ్వార్, తాసిల్దార్ లో ఆర్ ఐ. లు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. ACB : రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తిమింగలం..! 

  2. Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!

  3. Gold Price : రెండోరోజు వరుసగా మళ్ళీ తగ్గిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వ అనుమతి..!

  5. BOI : బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గింపు..!

మరిన్ని వార్తలు