Miryalaguda : వేసవిలో ఉపాధ్యాయులు స్వచ్ఛంద బడిబాట.. అభినందించిన ఎమ్మెల్యే..!
Miryalaguda : వేసవిలో ఉపాధ్యాయులు స్వచ్ఛంద బడిబాట.. అభినందించిన ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
వేసవి సెలవుల్లోనూ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బడిబాట పట్టాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో వర్చువల్ (జూమ్) మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం బడిబాట షెడ్యూల్ ఇవ్వనప్పటికీ గత వారం రోజులుగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా గ్రామాలలో ఇల్లిళ్లు తిరుగుతూ తల్లిదండ్రులను ఒప్పించి నమోదు చేయిస్తున్నందున ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఇదే స్ఫూర్తితో అంగన్వాడి ల నుండి ఐదు సంవత్సరాలు నిండిన విద్యార్థుల జాబితా సేకరించి ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం ఐదవ తరగతి పూర్తి అయిన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఉన్నత పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులందరూ బాధ్యత వహించాలని సూచించారు. ఉపాధ్యాయులందరూ బృందాలుగా ఏర్పడి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, ఆధునిక వసతులు, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్ లను వివరించి నమోదు చేయించాలని పేర్కొన్నారు.
జూన్ మాసంలో ప్రభుత్వం ద్వారా అధికారికంగా నిర్వహించబడే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో నాతో పాటు నా కార్యకర్తలు బి ఎల్ ఆర్ బ్రదర్స్ అందరూ ఉపాధ్యాయులతో మమేకమై పాఠశాలల బలోపేతానికి చేయూతనందిస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 29 ఉన్నత పాఠశాలలో సాయంత్రం పూట అదనపు తరగతులు నిర్వహించుటకు దాతల సహకారంతో వాలంటీర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల అభ్యసనాభివృద్ధికి తోడ్పాటునందిస్తానని తెలిపారు.
నిరుపేద అట్టడుగు వర్గాల విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఉపాధ్యాయులందరూ ఉద్యోగ బాధ్యతతో పాటు సామాజిక బాధ్యతగా స్వీకరించి వారి జీవితాలలో వెలుగులు నింపాలని ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారు చేయాలని అదే బిఎల్ఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు ఎం బాలాజీ నాయక్, బుక్య లక్ష్మణ్ నాయక్, వరలక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!
-
SSC : పది ఫలితాల్లో ఆ విద్యార్థిని అరుదైన రికార్డ్..!
-
Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)
-
Inter : ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ మోడల్ కళాశాల విద్యార్థుల సత్తా..!
-
District Collector : భూ భారతి చట్టంతో భూ తగాదాలకు చెక్.. జిల్లా కలెక్టర్..!









