Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

District Collector : భూ భారతి చట్టంతో భూ తగాదాలకు చెక్.. జిల్లా కలెక్టర్..!

District Collector : భూ భారతి చట్టంతో భూ తగాదాలకు చెక్.. జిల్లా కలెక్టర్..!

కంగ్టి, మన సాక్షి :

భూ భారతి చట్టం 2025తో భూ తగాదాలకు చెక్ పడడంతోపాటు భూ సమస్యల శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో దేవి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి ఆర్వోఆర్ చట్టంపై రైతుల అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి,ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ డి. మాధురి,ఆర్డీవో అశోక్ చక్రవర్తి తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ.. భూ సమస్యలను పరిష్కరించడానికి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందిస్తుందని తెలిపారు. సాదా బైనమా దరఖాస్తులను పరిష్కరించడానికి భూ భారతి ద్వారా అవకాశం వచ్చిందన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం ప్రతిష్టం చేస్తుందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. భూములకు జియో మ్యాప్ కోడ్లతో పక్కగా హద్దులు నిర్ణయించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా మ్యుటేషన్ దరఖాస్తులను పరిష్కరించుకోవచ్చన్నారు. భూమి రైతులకు ఆస్తి మాత్రమే కాదని జీవనాధారమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్,తహసిల్దార్ సి. భాస్కర్, ఏడిఏ నూతన్ కుమార్, డీఎల్పిఓ సంజీవరావు, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో రహీమొద్దీన్,ఏవో హరీష్ పవర్,సిడిసి చైర్మన్ షాదుల్, ఉప తహసిల్దార్ ముగ్ని, ఆర్ఐ లు మల్లేశ్వర్ రెడ్డి, తాజోద్దీన్, డిఎస్పి వెంకట్ రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Health : మీ జుట్టు నల్లబడాలా.. చాలా సింపుల్.. ఈ నీళ్లు దివ్యౌషధం..!

  2. District collector : భూ భారతి తో రైతులందరికి వన్ బి.. కలెక్టర్ వెల్లడి..!

  3. Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!

  4. Paddy Centers : కాంటాలు కావు, లారీలు లేవు, కుప్పలుగా ధాన్యం .. కొనేదెప్పుడో.. ఆందోళనలో రైతులు..!

  5. District collector : ప్రతి రైతుకు భూభారతితో న్యాయం.. అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు