Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Miryalaguda : లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూసేకరణ పూర్తయినందున తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

శనివారం ఆమె మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు.

నెల్లికల్ లిఫ్టు ఇరిగేషన్ కు సంబంధించి పిఎన్ పూర్తయినందున బిల్లుల చెల్లింపును , తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. కాగా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి భూసేకరణ పేపర్ నోటిఫికేషన్ ఇదివరకే జారీ చేయడం జరిగింది.

ఇందుకు సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలపై సైతం ఈ సమీక్ష సందర్భంగా సమీక్షించి సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

నిడమనూరు చెరువుకు నాగార్జునసాగర్ మెయిన్ కెనాల్ నుండి నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా నిడమనూరు ట్యాంకుకు ఓటి ద్వారా నీళ్లు నింపేందుకు ప్రణాళిక రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి దున్నపోతుల గండి, పోతుల పాలెం, వీర్లపాలెం భూసేకరణ తో పాటు, రెండు లిఫ్టులకు ఇది వరకే ఎంజాయ్మెంట్ సర్వే పూర్తయినందున తదుపరి ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా మిగిలిన లెఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డిలు మాట్లాడుతూ తమ తమ నియోజకవర్గాలలో పెండింగ్లో ఉన్న ఎత్తిపోతల పథకాల పనులను, భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇరిగేషన్ ఎస్.ఈ మల్లికార్జున్, ఈ ఈ కరుణాకర్, డిఈ కేశవ్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, రెవిన్యూ అధికారులు, తదితరులు హాజరయ్యారు.

MOST READ : 

  1. Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై సజ్జనార్ కీలక ప్రకటన..!

  2. Fish : వాహ్.. సూపర్ మచ్చి.. జాలరీ కి చిక్కిన ఆరుదైన చేప…!

  3. Gold Price : తగ్గినట్టే తగ్గి.. మళ్లీ యధావిధిగా గోల్డ్ రేట్..!

  4. Rythu : రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. ఇకపై వారికి కూడా ఖాతాలలో డబ్బులు..!

  5. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు