తెలంగాణBreaking Newsనారాయణపేట జిల్లా

Health : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన..! హెల్త్ కేర్ పై ప్రభుత్వం దృష్టి..!

Health : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన..! హెల్త్ కేర్ పై ప్రభుత్వం దృష్టి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

వైద్య వృత్తి ఎంతో పవిత్ర మైనదని, వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావడం గర్వకారణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గురువారం ఆయన నారాయణపేట జిల్లా పర్యటనకు వచ్చారు.

ముందుగా నారాయణపేట మండలం అప్పక్ పల్లి గ్రామ సమీపంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. కళాశాల వద్ద సీ.ఎస్ రామకృష్ణారావుకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు.

తర్వాత పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. అనంతరం మెడికల్ కళాశాలలో మెడికల్, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థులతో సీఎస్ ఇంట్రాక్ట్ అవుతూ కళాశాలలో చదువు కోవడం ఎలా అనిపిస్తుందని విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ

ఉమ్మడి పాలమూరు జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని, పాలమూరు జిల్లాలో 1996 లో పని చేశానని తెలిపారు. జిల్లాలో రెండు పెద్ద నదులు కృష్ణా, తుంగభద్ర ఉన్నాయని, జిల్లాకు వెనుక బడిన జిల్లాగా పేరు ఉండేదని చెప్పారు. పాలమూరు జిల్లాలో వెనుక బడిన ప్రాంతమైన నారాయణపేట జిల్లాగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ముందున్నారన్నారు.

చివరగా ఏర్పడిన జిల్లా కాబట్టి సమస్యలు ఉంటాయని కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలన్నారు. ఇంత చక్కటి మెడికల్ కళాశాలలో అన్ని వసతి సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు మంచిగా చదువుకుని తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని సూచించారు. కళాశాల నుంచి సుశిక్తులైన వైద్యులుగా తయారై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.

మెరుగైన సేవలు అందించినప్పుడే వృత్తి కి న్యాయం చేసిన వాళ్లం అవుతాం అన్నారు. 34 ఎకరాలలో ఉన్న మెడికల్ కళాశాలలో నర్సింగ్, ఎం సి హెచ్, హాస్టల్స్ నిర్మాణం తర్వాత ఇదో మెడికల్ సిటీగా మారుతుందని చెప్పారు. ఈ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లి పని చేసినా నారాయణ పేట మెడికల్ కళాశాలలో చదువుకున్నాం అని గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

అనంతరం సీ ఎస్ రామకృష్ణారావు కళాశాల కాన్ఫరెన్స్ హాల్ లో కళాశాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కళాశాల నిర్వహణ, ఇతర వసతి సౌకర్యాల గురించి చర్చించారు. నర్సింగ్ కళాశాల, ఎంసిఎచ్ నిర్మాణాల ను త్వరగా ప్రారంభించాలని టి జి ఎం ఎస్ ఐ డి సి అధికారులను ఆదేశించారు. వాటితో పాటు సిసి రోడ్లు, పార్కింగ్, మార్చురీ, పరికరాలు, ఇతర అదనపు భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

ప్రభుత్వం హెల్త్ కేర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని, నారాయణ పేట మెడికల్ కళాశాల రాష్ట్రంలోని మిగతా కళాశాలలకు ఒక మోడల్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ మెడికల్ కళాశాల డెమోగ్రఫీని ప్రజెంట్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామచందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, టిజీ ఎం ఎస్ ఐ డి సి సీ. ఈ. దేవేందర్, ఈ ఈ రవీందర్, డీ. ఈ. కృష్ణమూర్తి, వైద్య నిపుణులు పాల్గొన్నారు.

పెట్రోల్ పంపును పరిశీలించిన సీఎస్ : 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు మెడికల్ కళాశాల సందర్శన అనంతరం సింగారం మలుపు దారి వద్ద జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంప్ ను పరిశీలించారు. పంప్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది తో మాట్లాడారు. ఎక్కడ శిక్షణ తీసుకున్నారని, పంపులో రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారని అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ పంప్ లో ఫైర్ సేఫ్టీ ఉందా అని అడిగి తెలుసుకున్నారు. పంప్ నిర్వహణకు అవసరమైన నిబంధనలు అన్ని పాటించాలని సూచించారు.

రోజుకు ఎన్ని లీటర్ల పెట్రోల్ డీజిల్ విక్రయం జరుగుతుందని ప్రశ్నించారు. పెట్రోల్ ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారనీ, ఎన్ని రోజులకు పెట్రోల్ వాహనం వస్తుందని మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చంద్ర కళను అడగగా రోజుకు 5 వేల లీటర్ల విక్రయం జరుగుతుందని, హైదరాబాద్ నుంచి మూడు రోజులకు ఒకసారి పెట్రోల్ వాహనం వస్తుందని ఆమె సీ ఎస్ కు తెలిపారు. పంపు ద్వారా నెలకు ఎంత ఆదాయం వస్తుందో డిఆర్డిఓ మొగులప్ప సీ ఎస్ కు వివరించారు.

MOST READ : 

  1. DSP : రౌడీషీటర్లకు కౌన్సిలింగ్.. అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు..!

  2. Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!

  3. Nalgonda : నల్గొండ జిల్లాలో ఏడుగురు పోలీసులకు రివార్డులు.. ఎందుకో తెలుసా..!

  4. Narayanpet : పేద విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేయూత..!

  5. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు