Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsహైదరాబాద్

Fire Accident : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..!

Fire Accident : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

ఓ ఫ్లాట్లో అగ్నిప్రమాదం సంబందించిన ఘటన మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ పైడి నాయుడు కథనం ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్ మొఘల్ కాలనీలో హౌస్ నంబర్ 8-2-11/6/63/పి చిరునామాలో గల గ్రౌండ్ ప్లస్ త్రీ అంతస్తులు, పెంట్ హౌస్ ఉన్న అపార్ట్మెంట్ భవనంలో ఉదయం సుమారు 7:18 గంటలకు ఓ ఫ్లాట్ లో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు చెలరేగాయి.

ఫైర్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిన వెంటనే చంద్రాయణగుట్ట ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను సుమారు గంటన్నర కష్టపడి ఆర్పేశారు. ప్రమాదం జరిగిన భవనంలో ఆరేడు కుటుంబాలు నివసిస్తున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సుమారు పదిమందికి భవనం పైకి వెళ్లారు.

వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఎవరికి ఏ ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఇదిలా ఉండగా ఇన్స్పెక్టర్ నరేందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ఈ ప్రమాదం జరగలేదని చెప్పడం గమనార్హం.

MOST READ : 

  1. Viral Video : భార్యను తలకిందులుగా వేలాడదీసిన భర్త.. (వైరల్ వీడియో)

  2. Ponguleti : భూభారతి చట్టం.. రైతుల చుట్టం..!

  3. TG News : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

  4. Accident : తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. ఢీకొన్న బస్సు, జీపు..!

  5. TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

మరిన్ని వార్తలు