Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మల్టీపర్పస్ సిబ్బందికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ భరోసా..!

Miryalaguda : మల్టీపర్పస్ సిబ్బందికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ భరోసా..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మల్టీపర్పస్ సిబ్బందికి ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ తానే చేయిస్తానని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పల్లి గ్రామంలో నిర్వహించిన మల్టీపర్పస్ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, వర్మి కంపోస్ట్ తయారీ పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ సర్వీస్ చేసిన పలువురు మల్టీపర్పస్ సిబ్బందిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త సేకరించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సుందరంగా తీర్చిదిద్దాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను అన్నారు.

గ్రామాలన్ని అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు. ముఖ్యంగా గ్రామపంచాయతీలలో వర్మి కంపోస్ట్ తయారు చేయడం, దాన్ని రైతులకు ఇతరులకు అమ్మడం వల్ల గ్రామపంచాయతీకి ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది.. కాబట్టి మీరు ఈ ఎరువును నిరంతరంగా తయారు చేయాలని కోరుతున్నారు.

మల్టీపర్పస్ వర్కర్ల అందరికీ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం జీతం ఇవ్వనున్నది. ఇకనుండి మీరెవరు కూడా జీవితాలు సకాలంలో రావడంలేదని భయపడాల్సిన పనిలేదు ఆధైర్య పడవద్దు అన్నారు. అలాగే గ్రామపంచాయతీ లో పనిచేసే మల్టీ పర్పస్ సిబ్బంది అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ రు.470 ప్రతీ సంవత్సరం తన సొంత డబ్బుతో బిఎల్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ చేయించి ప్రతీ సంవత్సరం రెనివల్ చేయిస్తానని అన్నారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, పంచాయతీ సిబ్బంది .. పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు