UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!
UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!
మన సాక్షి :
డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ వాడకంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం భారీగా పెరిగింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ఇతర యాప్ ల ద్వారా లావాదేవీలు కొనసాగుతున్నాయి. అయితే డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగిపోవడం.. అప్పుడప్పుడు యూపీఐ పని చేయకపోవడం, పేమెంట్లు నిలిచిపోవడం, ప్రాసెసింగ్ లో రావడం ఇప్పుడు తరచుగా ఎదురవుతున్న సమస్య. ఈ సమస్యలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెద్ద నిర్ణయం తీసుకుంది.
డిజిటల్ పేమెంట్స్ లో సమస్యలను తగ్గించేందుకు కొత్త గైడ్లైన్స్ ను NPCI జారీ చేసింది. దేశంలోని అన్ని బ్యాంకులు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్.. ఈ రూల్స్ ను తప్పనిసరిగా జూలై 31 నాటికి అమలు చేయాల్సి ఉంది. UPI API ముఖ్యంగా ఈ రూల్స్ ఆధారపడి ఉన్నాయి. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్. ఇది యూపీఐ నెట్ వర్క్ ముందు సమాచారం మార్పిడి చేసే టెక్నికల్ రూట్. మీరు పేమెంట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యిందా అని చెక్ చేయడానికి, బ్యాలెన్స్ చూడాలన్నా లేదా యూపీఐ ఐడి చెక్ చేయాలన్న API ఉపయోగిస్తారు.
API లు ఎక్కువగా వాడటం వల్ల సర్వర్లు ఓవర్ లోడ్ అయిపోతున్నాయి. దాంతో పేమెంట్లు నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే బ్యాంకులు యూపీఐ యాప్ లు వారి టెక్నికల్ వ్యవస్థను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు అవసరం లేని API కాల్స్ ఎక్కువగా చేస్తున్నాయి. ఒక్కో పేమెంట్ స్టేటస్ చెక్ చేయడానికి పది సార్లు కాల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. దానివల్ల సిస్టం హ్యాక్ అవుతుంది. దాంతో NPCI ఫెయిల్ అవుతున్న APIలపై దృష్టి సారించింది. వెంటనే జోక్యం చేసుకొని కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.
ఇకనుంచి బ్యాంకులు అవివేకంగా API కాల్స్ పెడితే NPCI వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నది. అవసరమైతే ఆ బ్యాంకు యూపీఐ API నిషేధించడం జరుగును. కొత్త రూల్స్ ప్రకారం.. బ్యాంకులు వారి చేయాలి. అవసరం లేని కాల్స్ తగ్గించాలి. సర్వర్లు స్ట్రాంగ్ గా ఉండేలా టెక్నికల్ ఇన్ ప్రా స్ర్టక్షన్ ను మెరుగుపరుచుకోవాలి. చిన్నచిన్న ఇష్యూలకే పెద్ద API కాల్స్ పెట్టడం పూర్తిగా నిషేధం. ప్రతి API ఉపయోగం మీద పరిమితి ఉండాలి.
దేశంలో డిజిటల్ పేమెంట్స్ భవిష్యత్తును బలంగా నిలబెట్టేందుకు ఇది చాలా అవసరం. ప్రస్తుతం నెలకు 1200 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. API ఫెయిల్ అయితే కోట్లాదిమంది బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితి NPCI తట్టుకోలేక నూతన విధానం తీసుకొచ్చింది. కచ్చితంగా బ్యాంకులో కొత్త రూల్స్ ను పాటించాలని చెప్పింది. యూపీఐ యాప్ హ్యాంగ్ అవుతుందేమో అనే భయం మీకు ఇక ఉండదు. పేమెంట్లు త్వరగా కచ్చితంగా అవుతాయి. మీ డిజిటల్ లావాదేవీలు కూడా సురక్షితంగా జరుగుతాయి. బ్యాంకులు కూడా ఈ విధానానికి తగిన విధంగా సమర్థం కావాల్సి ఉంది.
ఇలాంటి కథనాలు చదవండి
- UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!
- UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
- Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!
- PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!









