BaluNaik : విద్యతోనే సమాజాన్ని మారుస్తాం.. భవిష్యత్తు తరాలకు బీజం వేస్తాం..!
BaluNaik : విద్యతోనే సమాజాన్ని మారుస్తాం.. భవిష్యత్తు తరాలకు బీజం వేస్తాం..!
దేవరకొండ, మనసాక్షి :
దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం (మార్కెట్ యార్డులో) నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ మన రాష్ట్ర బిడ్డలు ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి, ప్రపంచానికి మార్గదర్శకంగా ఎదగాలన్న ఆశయం మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అన్నారు.
ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్లు, 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించడమే మా లక్ష్యం అన్నారు. ఇది కేవలం బడుల నిర్మాణం కాదు, ఇది సమాజ నిర్మాణం అన్నారు. ప్రతి వర్గానికి విద్య ద్వారా సమానావకాశాలు కల్పించాలన్న సంకల్పంతో సమ సమాజ నిర్మాణం వైపు సీఎం ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అని అన్నారు.
తెలంగాణ బిడ్డలు భవిష్యత్ భారతాన్ని తీర్చిదిద్దే నాయకులుగా ఎదగాలి అనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యుల్ని చేస్తున్నాం అని అన్నారు. గ్రామీణ ప్రాంత పిల్లలకు ప్రపంచ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఒక అత్యాధునిక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నాం అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం కొలముంతల్ పహాడ్ గ్రామ సమీపంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో 25 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి త్వరలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క తో కలిసి శంకుస్థాపన చేస్తాం అని అన్నారు.
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందించాలంటే బలమైన విద్యుత్ మౌలిక సదుపాయాలు అవసరం. అందుకనుగుణంగా దేవరకొండ నియోజకవర్గ వర్గంలో 132/33కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల మంజూరు అయింది అన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి పథంలోకి రావడం మా లక్ష్యం అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం అన్నారు. దేవరకొండ నియోజకవర్గ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు కృష్ణయ్య, మాజీ జడ్పీటీసీ మారుపాకల అరుణ సురేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏడ్పుల గోవింద్ యాదవ్, సీనియర్ నాయకులు హన్మంతు వెంకటేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, మాజీ సర్పంచ్ దొండేటి మల్లా రెడ్డి, యువ నాయకులు రమేష్ నాయక్, బాబు రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District collector : ఆ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
Make in India : మేక్ ఇన్ ఇండియా విజన్‌కు ఊతం.. Q1 2025లో సోలార్ మాడ్యూల్ మార్కెట్లో అగ్రస్థానం..!
-
Suryapet : మా పిల్లల్ని మాకు ఇప్పించండి.. లేకుంటే ఆత్మహత్యలు శరణ్యం.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!
-
Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!









