Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావైద్యం

District collector : ఆ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : ఆ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఈ సారి ముందస్తుగానే ముసురు వర్షాలు కురుస్తుండడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.

గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణ కు వైద్యశాఖ అధికారులు, వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కు పంచాయతీరాజ్, వాటర్ సప్లై, మున్సిపల్, ఎడ్యుకేషన్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక కు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

గతేడాది జిల్లాలో నమోదైన డెంగ్యూ కేసుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటిలలో గతేడాది ఎన్ని కేసులు నమోదు అయ్యాయి ? ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకున్నారని కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

అలాగే శిథిలావస్థకు చేరిన పెద్ద పెద్ద భవనాలను కూల్చివేసేందుకు యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. లేనిపక్షంలో మున్సిపల్ అధికారులే వాటిని కూల్చి వేయించాలన్నారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

అంతకుముందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్ సిజనల్ వ్యాధుల గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

సమావేశంలో డీఈవో గోవిందరాజులు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శైలజ, డిపిఓ భిక్ష పతి, డి ఎల్ పి ఓ సుధాకర్, నారాయణపేట, మక్తల్, మద్దూర్, మున్సిపల్ కమిషనర్లు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

  1. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  2. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

  3. TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  4. Suryapet : మా పిల్లల్ని మాకు ఇప్పించండి.. లేకుంటే ఆత్మహత్యలు శరణ్యం.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..!

  5. Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!

మరిన్ని వార్తలు