Breaking Newsఆంధ్రప్రదేశ్పండుగలు
గణనాథుడికి ప్రత్యేక పూజలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన బాబు
మదనపల్లి రూరల్ కోళ్ల బైలు పంచాయతీ పరిధిలోని బయ్యారెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గణనాథుడికి ప్రత్యేక పూజలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన బాబు
మదనపల్లి, మనసాక్షి :
మదనపల్లి రూరల్ కోళ్ల బైలు పంచాయతీ పరిధిలోని బయ్యారెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక యువత ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన శ్రీరామ్ చినబాబుకు యువత, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు. యువత ఆహ్వానాన్ని మన్నించి తమ ప్రాంతానికి విచ్చేసి పూజల్లో పాల్గొన్న శ్రీరామ్ చినబాబుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వర్, కార్తీక్, లోకేష్, భరత్, సందీప్, మధు, రామ్మోహన్, మంజు, సుజాత, శాంతమ్మ, గీత మరియు స్థానికులు పాల్గొన్నారు.










