TOP STORIESBreaking News

Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేసే రైతు భరోసా పథకం వానాకాలం సీజన్ నుంచి సకాలంలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది.

ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వానాకాలం వరి నాట్లు వేసే లోపే రైతు భరోసా పథకం పూర్తిస్థాయిలో అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రైతుబంధు పథకం కింద ఎకరానికి గత ప్రభుత్వం రెండు విడతలుగా 10 వేల రూపాయలను అందజేసింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 12,000 రూపాయలను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసాను రెండు విడతలుగా కాకుండా ఒకేసారి ఎకరానికి 12,000 రూపాయలను అందజేయనున్నట్లు సమాచారం.

రెండు విడతలుగా రైతు భరోసా అందజేసే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నందున రైతులకు ఒకేసారి రెండు పంటలకు గాను ఎకరానికి 12 వేల రూపాయలను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో రైతులకు పంట పెట్టుబడి సక్రమంగా అందనున్నట్లుగా సమాచారం. పెండింగ్ లో ఉన్న రైతు భరోసా పథకాన్ని ఈనెల (జూన్) మూడవ వారంలో రైతుల ఖాతాలలో జమ చేస్తారని సమాచారం.

MOST READ : 

  1. TG News : భూమి లేని రైతులకు భారీ శుభవార్త..!

  2. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

  3. District collector : భూ భారతి చట్టంలో సాదా బైనమా అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే..

  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

  5. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

మరిన్ని వార్తలు