TOP STORIESBreaking News

Mosquito : మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రమ్మన్నా రావు..!

Mosquito : మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రమ్మన్నా రావు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

వర్షాకాలం వచ్చేసింది.. దోమలు విపరీతంగా పెరుగుతుంటాయి. మన ఇంటి సమీపంలో వర్షపు నీరు నిల్వ ఉండడం తోపాటు ఇతర కారణాలవల్ల దోమలు వస్తుంటాయి. అందుకు మనం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటాము. అందులో భాగంగా ఈ సీజన్లో మన ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రమ్మన్నా రావంట అవేంటో చూద్దాం…

వర్షాకాలంలో దోమలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి..

యూకలిప్టస్ : మొక్క ఇంటి ఆవరణలో ఉంటే ఆ మొక్క ఇంటి లోపలికి దోమలు రాకుండా చేస్తుంది. దాంతో దోమల భయం, బెడద తగ్గుతుంది.

లెమన్ గ్రాస్ : ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే దోమలు ఇంటి లోపలికి రావు. దీని నుంచి వచ్చే వాసన దోమలను రానివ్వదు. చాలామంది తమ ఇంటి ఆవరణలో లెమన్ గ్రాస్ చెట్లను పెంచుతుంటారు.

లావెండర్ : ఈ మొక్క నుంచి వచ్చే వాసన చాలా మంచిగా ఉంటుంది. దీనిని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. ఈ వాసన దోమలకు నచ్చదు. అందుకోసం ఈ మొక్క ఇంట్లో ఉంటే దోమలు రావు.

పుదీనా : పుదీనా మొక్క ఇంటి ఆవరణలో ఉంచుకోవడం వల్ల దోమలు రావు. దోమలకు పుదీనా వాసన అంటే ఇష్టం ఉండదు. అందుకు ఇంటి ఆవరణలో పుదీనా మొక్కలు పెంచుకుంటే దోమల నుంచి కాపాడుకోవచ్చును.

బంతి చెట్లు : బంతిపూల చెట్లు లేదా బంతి పువ్వులు ఇంట్లో ఉన్నా కూడా దోమలు రావు. ఇవి దోమలను ఇతర కీటకాలను కూడా ఇంట్లోకి రానివ్వవు. అందువల్ల ఇంటి ఆవరణలో బంతిపూల మొక్కలను పెంచుకోవాలి.

By : M.N.REDDY, ManaSakshi

MOST READ : 

  1. Health : ఆరోగ్యంగా ఉన్న వారిలో సగం మందికి గుండెపోటు ముప్పు.. నివారించుకోవచ్చా తెలుసుకుందాం..!

  2. Health : నల్ల యాలకులతో ఇన్ని లాభాలా..!

  3. Health: ఉదయం మీ దినచర్యలో ఇవి ఉంటే.. ఇక మీ ఆరోగ్యం మీ వెంటే..!

  4. Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!

  5. Health : ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఇంట్లో తయారుచేసిన పానీయాలు.. గుండె, మూత్రపిండాలు భద్రం..!

మరిన్ని వార్తలు