TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!

Gold Price : ఒక్కసారిగా భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధర ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర భారీగా తగ్గి శుభవార్త అందింది. ఇటీవల కాలంలో లక్ష రూపాయలకు తులం బంగారం ధర ఉండగా శనివారం ఒక్కరోజే భారీగా తగ్గింది. 100 గ్రాముల బంగారంకు 16,300 తగ్గింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 16,300 రూపాయలు తగ్గి 9,79,700 రూపాయలకు చేరిందివ అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 15వేల రూపాయలు తగ్గి 8,98, 000గా ఉంది.
ఈరోజు తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరంలో శనివారం బంగారం ధర 10 గ్రాముల (తులం) బంగారం కు 24 క్యారెట్ కు 9,79,700 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ తులం బంగారం కు 89, 800 రూపాయలు ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.









