TOP STORIESBreaking News

Farmer : ఆ ప్రభుత్వ పథకాలకు.. ప్రతి రైతుకు ఇది తప్పనిసరి.. బిగ్ అలర్ట్..!

Farmer : ఆ ప్రభుత్వ పథకాలకు.. ప్రతి రైతుకు ఇది తప్పనిసరి.. బిగ్ అలర్ట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అందజేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన తో పాటు ఇతర సంక్షేమ పథకాలు రైతులకు వర్తింపజేయాలనే లక్ష్యంతో ఫార్మర్ రిజిస్ట్రీని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ ప్రక్రియను ప్రారంభించగా తెలంగాణలో ఇటీవల ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అందుకు కాను ప్రతి రైతు వ్యవసాయ శాఖ వద్ద ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవలసిన అవసరం ఉంది. ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకుంటే ప్రతి రైతుకు 14 అంకెల కార్డును అందజేస్తారు. ఆ కార్డులో పూర్తి సమాచారం ఉంటుంది. బ్యాంకు రుణాలు, పీఎం కిసాన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో రావడానికి, ఇతర సంక్షేమ పథకాలకు కూడా దీనిని ఉపయోగిస్తారు.

ఫార్మర్ రిజిస్ట్రీ ఎలా..?

రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఆధార్ తో లింక్ ఉన్న ఫోన్ నెంబర్ తీసుకెళ్లి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది.

MOST READ :

District SP : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ఆ స్కీముల పట్ల అప్రమత్తంగా లేకుంటే మోసపోతారు..!

Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!

Rythu : రైతుల ఖాతాలలో రూ.10వేలు.. బిగ్ అప్డేట్..!

TG News : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ఇవే..!

Rythu : రైతుల ఖాతాలలో రూ.10వేలు.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు