District SP : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ఆ స్కీముల పట్ల అప్రమత్తంగా లేకుంటే మోసపోతారు..!
District SP : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ఆ స్కీముల పట్ల అప్రమత్తంగా లేకుంటే మోసపోతారు..!
నారాయణపేటటౌన్, మనసాక్షి :
మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసం చేసే మల్టిలెవెల్ వ్యాపారాలు పెరుగుతున్నాయనీ, మీ క్రింద ఎక్కువ మంది ఎజెంట్లను చేర్పించి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందండి అనే వాటిని నమ్మవద్దు అని ఎస్పీ అన్నారు.
ఇలాంటి మల్టీలెవల్ వ్యాపారం చేస్తూ ప్రజల నుండి డబ్బులు సేకరించి ఆర్దికంగా మోసం చేస్తూ చైన్ సిస్టం మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా ఆర్థికపరమైన మోసాలు జరుగుతున్నాయని ప్రజలు గుర్తించాలని కోరారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది అన్నారు.
సైబర్ మోసగాళ్ళు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారనీ సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ మోసగాళ్లు మల్టీలెవెల్ మార్కెటింగ్ పై దృష్టి సారించి గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి మోసగించి ఆర్థిక నష్టాన్ని కలగ చేస్తున్నారని అన్నారు.
మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను చాలామంది విదేశాల్లో ఉండి ఒక రాకెట్ లా నడుపుతున్నారని అన్నారు. అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే అది మోసమని గ్రహించాలనీ, అత్యాశకు పోతే మోసపోవడంఖాయమన్నారు. ఇలాంటి నెట్వర్క్ లో ఎవరు చేరొద్దు ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరు వెళ్లవద్దని చెప్పారు.
సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటన పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలనీ పేర్కొన్నారు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా ఆ లోపే.. మంత్రి తుమ్మల క్లారిటీ..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై క్లిలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!
-
Hyderabad : మాగంటి గోపీనాథ్ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు.. ఉద్వేగానికి లోనైన బీఆర్‌ఎస్ అధినేత..!
-
Rythu : తెలంగాణలో రైతులకు అదిరిపోయే మరో కొత్త పథకం.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu : తెలంగాణలో రైతులకు అదిరిపోయే మరో కొత్త పథకం.. లేటెస్ట్ అప్డేట్..!









