Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

Alumni : ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

Alumni : ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

సూర్యాపేట, మనసాక్షి :

1998 – 1999 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. సిద్ధార్థ ఉన్నత పాఠశాల లో చదువుకున్న విద్యార్థులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనందంగా పాత రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి గురువులను ఘనంగా సత్కరించి , పాదాభివందనాలు చేశారు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ 26 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో తమ ముందుకు రావడం, సన్మానించడం శుభ పరిణామమని కొనియాడారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

అంతకుముందు పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ గురువులు బోధించిన చదువులు, వారి ఆశీస్సుల కారణంగా తామంతా ఉన్నత స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హనుమంతరావు, సత్యనారాయణ, జితేందర్ రెడ్డి, కె సత్యనారాయణ, కుశలవ రెడ్డి, వెంకట్ రెడ్డి, వేణుగోపాల్ లతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

MOST READ :

  1. District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!

  2. Nalgonda : గత జ్ఞాపకాలతో వెల్లువిరిసిన ఆనందం.. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..!

  3. District collector : చెన్నై, బెంగళూరుకు అంజీర ఎగుమతి.. సాగు పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఆ రైతుకు సన్మానం..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఈ పత్రాలు తప్పనిసరి..!

  5. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు