New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కొత్త రేషన్ కార్డుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. అనర్హులకు రేషన్ కార్డులు ఉండడంతో వాటిని రద్దు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ కోసం సమగ్ర సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ సర్వే ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, వార్డులు, సచివాలయాల పరిధిలో నిర్వహించనున్నారు.
ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించింది. అక్రమాలను అరికట్టేందుకు గాను అర్హులైన వారికి ఈ కేవైసీ నమోదు ద్వారా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ద్వారా అనర్హులను గుర్తించి వారికున్న రేషన్ కార్డులను రద్దు చేయడంతో పాటు అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేషన్ కార్డులను అర్హులైన వారికి అందజేస్తే సంక్షేమ పథకాలు కూడా అర్హులైన వారికి అందే విధంగా ఉంటాయని అందుకు ప్రభుత్వం సర్వే చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.
MOST READ :
-
Holiday : స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం సెలవు.. సడన్ గా నిర్ణయం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో భారీ మార్పులు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..!
-
WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!
-
Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!









