Rythu : ఆ రైతులకు డబుల్ బోనాంజా.. ఎకౌంట్లో రూ.20 వేలు..!

Rythu : ఆ రైతులకు డబుల్ బోనాంజా.. ఎకౌంట్లో రూ.20 వేలు..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పంట సహాయం అందించడానికి అన్నదాత సుఖీభవ పథకంతో డబుల్ బోనాంజా అందించేందుకు సిద్ధమైంది. పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి 6000 రూపాయలు అందజేస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఆరువేల రూపాయలను మూడు విడుదలగా ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. కాగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ రైతులకు పంట సహాయం అందజేయడానికి అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఏడాదికి 14 వేల రూపాయలను అందజేసేందుకు సిద్ధమైంది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఆంధ్రప్రదేశ్ సర్కార్ అందజేసే అన్నదాత సుఖీభవ పథకంతో కలిపి ఏడాదికి రైతులకు 20వేల రూపాయలు వారి ఖాతాలలో జమకానున్నాయి. ఈ డబ్బులను మూడు విడుతలుగా రైతులకు వారి వారి ఖాతాలలో జమ చేయనున్నారు. పి యం కిసాన్ యోజన పథకం 20వ విడత జూన్ నెలాఖరుకు గాని జూలై మొదటి వారంలో గాని రైతుల ఖాతాలలో జమ చేసే అవకాశం ఉంది.
ALSO READ : Alumni : 56ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం..!
నరేంద్ర మోడీ ప్రభుత్వం అందజేసే పిఎం కిసాన్ యోజన పథకం డబ్బులు 6000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సర్కార్ అందజేసే అన్నదాత సుఖీభవ నిధులు 14 వేల రూపాయలు మొత్తంగా 20వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ కావాలంటే రైతులు ఈ కేవైసీను పూర్తి చేసుకోవాలని పేర్కొన్నది. ఈ కేవైసీ పూర్తి చేసుకోవడానికి రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసుబుక్ తో పాటు మొబైల్ నెంబర్ తో ఈ కేవైసీ తీసుకోవాల్సి ఉంది.
వాస్తవానికి ఈనెల 20వ తేదీ నుంచి ఈ పథకం నిధులు రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉన్నప్పటికీ ఈఎం కిసాన్ ఆలస్యమైనందున అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా ఆలస్యం అయ్యాయి. ఈ నెలాఖరుకు గాని జూలై మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలలో జమ కానున్నాయి.
MOST READ :
-
District collector : భూభారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. క్షేత్రస్థాయిలో పరిశీలన..!
-
ACB : రేషన్ కార్డు కోసం లంచం.. పట్టుకున్న ఏసీబీ..!
-
Narayanpet : మా సార్ మాకు కావాలి.. విద్యార్థుల ఆందోళన..!
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!
-
Rythu Bharosa : రైతు భరోసా నిధులు ఒకేసారి బ్యాంకు ఖాతాలో 36వేలు.. 4 రోజుల్లో క్లోజ్..!









