Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : భూభారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. క్షేత్రస్థాయిలో పరిశీలన..!

District collector : భూభారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. క్షేత్రస్థాయిలో పరిశీలన..!

సూర్యాపేట, మనసాక్షి

రెవెన్యూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన భూ- భారతి రెవెన్యూ సదస్సులు నిన్నటితో ముగిసాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 18 రోజులపాటు గ్రామాల్లో నిర్వహించిన భూభారతి సదస్సుకు రైతులు ప్రజలు నుండి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు.

జిల్లాలో 22 మండలాల్లోని 268 రెవెన్యూ గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులలో 44 ,741 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని దీనిలో ముఖ్యంగా మిస్సింగ్ సర్వే నెంబర్ కు 9,032 ఇతరములకు 27, 430 వచ్చాయని తెలిపారు. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు ఈ రెవెన్యూ సదస్సులో తమ దరఖాస్తుల అందజేశారని తెలిపారు.

దరఖాస్తుల పరిశీలన కొరకు శనివారం నుండి ఆగస్టు 15 వరకు అన్ని గ్రామాలకు రెవెన్యూ అధికారులు పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని మిగిలిన దరఖాస్తులను రైతుల వద్ద ఉన్న భూమి యొక్క డాక్యుమెంట్లను క్షేత్ర పరిశీలన చేసి పరిష్కరిస్తారని అన్నారు.

MOST READ : 

  1. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

  2. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!

  3. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

  4. Calendar : వైరల్ అవుతున్న 84 ఏళ్ల క్యాలెండర్.. డేటు, వారం సేమ్.. ఏం జరిగిందో తెలుసుకోండి..!

  5. District collector : రైతు భరోసా దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు.. రూ.516 కోట్లు రైతుల ఖాతాలో జమ..!

మరిన్ని వార్తలు