Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

Narayanpet : మా సార్ మాకు కావాలి.. విద్యార్థుల ఆందోళన..!

Narayanpet : మా సార్ మాకు కావాలి.. విద్యార్థుల ఆందోళన..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

సాధారణంగావిద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే… పాఠాలు చెప్పకుండా నిర్లక్ష్యం చేసే అధ్యాపకులు మాకు వద్దు అంటూ విద్యార్థులు ధర్నాలు రాస్తారోకో లు చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసే ప్రిన్సిపల్ తమకు తిరిగి ప్రిన్సిపల్ గా రావాలని మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు వసతిగృహం ఎదుట ఆందోళన చేపట్టారు.

విద్యార్థులు కాలేజీకి రాకపోతే స్వయంగా ప్రిన్సిపల్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మరి విద్యార్థులను కాలేజీకి పంపాలని చెప్పేవాడని… విద్యార్థుల భవిష్యత్తు గురించి ప్రిన్సిపల్ పని చేస్తాడని అలాంటి ప్రిన్సిపల్ లేకపోతే తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రెడ్డి వచ్చేవరకు తాము కాలేజీకి రామని స్పష్టం చేశారు.

ప్రిన్సిపాల్ ఇక్కడ లేనప్పటి నుంచి క్లాసులు చెప్పే వారే లేరని… ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, మైనారిటీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి ప్రిన్సిపాల్ ను తిరిగి ఇక్కడికి రప్పించేలా కృషి చేస్తామన్నారు.

పలువురు మైనార్టీ నాయకులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి విద్యార్థులను ఇబ్బందుల గురి చేసే అధ్యాపకులను ఇక్కడి నుంచి పంపించి వేసి… ప్రిన్సిపాల్ జగదీష్ రెడ్డిని తిరిగి ఇక్కడికి వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు.

MOST READ : 

  1. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

  2. District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!

  3. Calendar : వైరల్ అవుతున్న 84 ఏళ్ల క్యాలెండర్.. డేటు, వారం సేమ్.. ఏం జరిగిందో తెలుసుకోండి..!

  4. Devarakonda : సాహసయాత్ర.. బైక్ పై ఆలిండియా చుట్టివచ్చిన యువకుడు..!

  5. District collector : భూభారతి పై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. చట్ట ప్రకారం సమస్యలు పరిష్కరించాలి..!

మరిన్ని వార్తలు