TSI : పబ్లిక్ లిస్టింగ్ సన్నాహాల్లో FINDI లిమిటెడ్..!
TSI : పబ్లిక్ లిస్టింగ్ సన్నాహాల్లో FINDI లిమిటెడ్..!
DAM క్యాపిటల్, యాంబిట్, రోత్‌షైల్డ్ సంస్థలను అడ్వైజర్లుగా నియమించుకున్న ఫిన్‌టెక్ సంస్థ; రాబోయే క్వార్టర్లలో డీఆర్‌హెచ్‌పీ సమర్పణ
ఇండియా: భారత్‌లో తమకు మెజారిటీ వాటాలున్న అనుబంధ సంస్థ ట్రాన్సాక్షన్ సొల్యూషన్స్ ఇంటర్నేషనల్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (TSI) యొక్క ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) కోసం DAM క్యాపిటల్ అడ్వైజర్స్, యాంబిట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను బీఆర్ఎల్ఎంలుగా FINDI Ltd నియమించుకుంది.
అన్ని రెగ్యులేటరీ ఫైలింగ్స్‌కి DAM క్యాపిటల్ లీడ్ పాత్ర పోషించనుంది. వీటికి తోడుగా ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థల్లో ఒకటైన రోత్‌షైల్డ్ అండ్ కంపెనీ కూడా ఎక్స్‌క్లూజివ్ ఫైనాన్షియల్ అడ్వైజరుగా నియమించుకోబడింది.
“భారత్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఆర్థిక సేవల మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. FINDI ఇక్కడ పటిష్టమైన భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించుకుంది.
దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలు అస్సలు అందని, మరియు అంతగా అందని వర్గాలకు విస్తృత స్థాయిలో సర్వీసులను అందించే దిశగా ఈ ఐపీవో ఒక వ్యూహాత్మకమైన ముందడుగు కాగలదు. DAM క్యాపిటల్, యాంబిట్, రోత్‌షైల్డ్ మా భాగస్వాములుగా, దీర్ఘకాలంలో మా ఇన్వెస్టర్లకు మరింత విలువ చేకూర్చగలమని, భారతదేశ ఆర్థిక సేవల వ్యవస్థలో పరివర్తనాత్మకమైన మార్పును తేగలమని విశ్వసిస్తున్నాం” అని FINDI మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో దీపక్ వర్మ తెలిపారు
TSI ద్వారా FINDI ఇటీవల ఇండీక్యాష్‌ను (టాటా కమ్యూనికేషన్స్‌కి చెందిన వైట్ లేబుల్ ఏటీఎం వ్యాపారం), అలాగే మర్చంట్ ఆధారిత పేమెంట్ సొల్యూషన్స్ ప్లాట్‌ఫాం బ్యాంకిట్‌ను (BANKIT) కొనుగోలు చేసింది. TSIతో పాటు (12 టాప్ భారతీయ బ్యాంకుల భాగస్వామ్యంతో బ్రౌన్ లేబుల్ ఏటీఎంలను నిర్వహిస్తోంది) ఈ రెండు సంస్థలు (ప్రస్తుతం FindiATM మరియు FindiBANKITగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి) కలిసి భారత్‌లో FINDI నిర్వహిస్తున్న 2,00,000 పైగా క్యాష్ మరియు డిజిటల్ పేమెంట్స్ టచ్‌పాయింట్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయి.
ప్రతిపాదిత ఐపీవో కొత్తగా షేర్ల జారీ మరియు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం మేళవింపుగా ఉంటుంది. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను TSI, FindiATM మరియు FindiBANKIT వ్యాప్తంగా FINDI యొక్క ఆర్థిక మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, కొత్త తరం డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్‌పై ఇన్వెస్ట్ చేసేందుకు, భారత గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లలో అంతగా సేవలందని వర్గాలకు లాస్ట్-మైల్ యాక్సెస్ కల్పించేందుకు ఉపయోగించుకోనున్నారు.
రాబోయే త్రైమాసికాల్లో FINDI లిమిటెడ్ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసే అవకాశం ఉంది.









