తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : నేను చనిపోలేదు బతికే ఉన్నా.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు మొర..!

Narayanpet : నేను చనిపోలేదు బతికే ఉన్నా.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు మొర..!

నారాయణపేట టౌన్,  మనకుసాక్షి :

చనిపోయిన తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడం సహజం. కానీ నారాయణపేట జిల్లా కేంద్రంలోని పదవ వార్డుకు చెందిన పసుపుల లక్ష్మిని బతికుండగానే మున్సిపల్ శాఖలో పనిచేసిన కొంతమంది చనిపోయినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. ఫలితంగా బాధితురాలు వితంతు పెన్షన్ కు అనర్హురాలిగా దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంది.

పసుపుల లక్ష్మి భర్త పసుపుల రాములు 2018 నవంబర్ 2 మరణించాడు. ఆ తర్వాత ఈయన భార్య పసుపుల లక్ష్మి వితంతు పెన్షన్ కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంది. ఏమి జరిగిందో తెలియదు కానీ ఏకంగా పసుపుల లక్ష్మి చనిపోయినట్లుగా ఆన్లైన్లో కనిపిస్తున్నడంతో చెప్పులు అరిగేలా మున్సిపల్ కార్యాలయం, కలెక్టరేట్ తిరిగినా కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి బాధితురాలు లక్ష్మి వచ్చింది. ఈ అంశంపై వెంటనే జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని ప్రజావాణిలో బాధితురాలు లక్ష్మి విన్నవించింది.

MOST READ : 

  1. Nalgonda : పానగల్ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు.. సోమేశ్వర ఆలయం సందర్శించిన రాష్ట్ర దేవాదాయ సెక్రటరీ..!

  2. Srisailam : శ్రీశైలంకు భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం.. ఇక గేట్లు ఎత్తుడే..!

  3. Amith Shah : 2026 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్..!

  4. ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!

  5. ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!

మరిన్ని వార్తలు