Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : పానగల్ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు.. సోమేశ్వర ఆలయం సందర్శించిన రాష్ట్ర దేవాదాయ సెక్రటరీ..!

Nalgonda : పానగల్ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు.. సోమేశ్వర ఆలయం సందర్శించిన రాష్ట్ర దేవాదాయ సెక్రటరీ..!

నలగొండ, మనసాక్షి :

ఎంతో చరిత్ర కలిగిన పానుగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు.
సోమవారం ఆమె నల్గొండ సమీపంలోని పానుగల్ లో ఉన్న శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ఛాయా సోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతేకాక అభిషేకం చేశారు ఈ సందర్భంగా ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రత్యేకత పై ఏమైనా సాహిత్యం ఉంటే ఇవ్వాలని అడిగారు.దేవాలయ చరిత్ర ను తెలుసుకున్న ఆమె దేవాలయ ప్రాముఖ్యతను, అదేవిధంగా శిల్ప విశిష్టత, చరిత్ర అన్నింటిని భద్రపరిచేలా చూడాలని ఆర్కిటెక్చర్ సూర్యనారాయణమూర్తి, అలాగే ధార్మిక పరిషత్ సలహాదారు గోవింద హళ్లితో అన్నారు.

ఆలయ అర్చకులు ప్రిన్సిపల్ సెక్రటరీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి విశేష పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె దేవాలయంలో ఉన్న కొనేరును సందర్శించారు .జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Srisailam : శ్రీశైలంకు భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం.. ఇక గేట్లు ఎత్తుడే..!

  2. TG News : సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. ఎగిరి పడిన కార్మికులు.. 8 మంది మృతి..!

  3. Potato Kurma : స్టార్ హోటల్ టేస్టీ.. ఆలూ కుర్మా చేయడం వెరీ సింపుల్.. అన్నింటిలోకి అదిరిపోద్ది..!

  4. Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. Suryapet : వైద్యుల నిర్లక్ష్యం తొ బాలుడి మృతి.. ఆసుపత్రి పై దాడి..!

మరిన్ని వార్తలు