క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District SP : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. వారి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండొద్దు..!

District SP : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. వారి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండొద్దు..!

నారాయణపేట టౌన్,  మనసాక్షి :

జిల్లాలోని ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచరాదని, ప్రజలకు తక్షణమే న్యాయం అందించి పోలీస్ వ్యవస్థ పై నమ్మకం భరోసా కలిగేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు.

జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 09 మంది ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడి వెంటనే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని తగిన సలహాలు సూచనలు విచారణ.

ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని తదుపరి కేసు విచారించి పరిష్కరించాలని తెలిపారు. భూ తగదాలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తప్పకుండా రసీదు, ఎఫ్ఐఆర్ కాఫీ ఇవ్వాలని పోలీసు అధికారులకు తెలిపారు.

జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.

MOST READ  : 

  1. Narayanpet : నేను చనిపోలేదు బతికే ఉన్నా.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు మొర..!

  2. Srisailam : శ్రీశైలంకు భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం.. ఇక గేట్లు ఎత్తుడే..!

  3. ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!

  4. Gold Price : మరోసారి తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  5. Potato Kurma : స్టార్ హోటల్ టేస్టీ.. ఆలూ కుర్మా చేయడం వెరీ సింపుల్.. అన్నింటిలోకి అదిరిపోద్ది..!

మరిన్ని వార్తలు