Miryalaguda : సిపిఆర్ తో రైతును కాపాడిన 108 సిబ్బంది..!
Miryalaguda : సిపిఆర్ తో రైతును కాపాడిన 108 సిబ్బంది..!
వేములపల్లి, మన సాక్షి :
విద్యుత్ షాక్ కు గురైన రైతును 108 సిబ్బంది సకాలంలో స్పందించి ఆదుకున్న సంఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోని మాడుగులపల్లి మండలం ఇసుక బాయిగూడెం గ్రామానికి చెందిన వల్లపుదాసు చంద్రయ్య వేములపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ మోటార్ వద్దకు వెళ్లి మోటర్ ను అమరుస్తుండగా 11 కెవి విద్యుత్తు లైన్ తగలడంతో షాక్కు గురైనాడు.
తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి 108 కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది అక్కడికి చేరుకుని చంద్రయ్యకు సిపిఆర్ చేసి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చంద్రయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సిబ్బంది ఈఎంటి వెలిజాల సైదులు, పైలట్ పగిల్ల జానకి రాములు తెలిపారు. 108 సిబ్బంది సమయానికి రావడంతో చంద్రయ్య కు ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
MOST READ :
-
Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!
-
Paddy Cultivation : బురద పొలాలు, వరినాట్లు లేవు.. ఇక అంతా పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టడమే.. అది ఎలాగో తెలుసుకుందాం..!
-
Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Narayanpet : నేను చనిపోలేదు బతికే ఉన్నా.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు మొర..!









