Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్వైద్యం

Nizamabad : 108 అంబులెన్స్ లో ప్రసవం..!

Nizamabad : 108 అంబులెన్స్ లో ప్రసవం..!

భీంగల్, మన సాక్షి:

సిరికొండ శిరీష వయస్సు 32 సంవత్సరాలు గ్రామము రహత్ నగర్ మండలం భీంగల్ శిరీష పురిటి నొప్పులతో బాధపడుతూ సహాయ అర్థం 108 అంబులెన్స్ కు ఫోన్ చేయడం జరిగింది. 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకొని శిరీషను పరిశీలించి పీహెచ్సీ భీంగల్ కు తీసుకురావడం జరిగింది.

తదనంతరం పీహెచ్సీ సిబ్బంది శిరీషను పరిశీలించి మెరువైన చికిత్స గురించి 108 అంబులెన్స్ లో ఆర్మూర్ ప్రభుత్వ హాస్పిటల్ పంపగా శిరీషను ఆంబులెన్స్ లో తీసుకొని ఆర్మూర్ ఏరియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆంబులెన్స్ లో అధికపురిటి నొప్పులతో బాధపడుతున్న శిరీషను గమనించిన అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి అంబాదాస్ మరియు పైలెట్ రాజన్న వాహనాన్ని పక్కకు నిలుపుకొని అంబులెన్స్ లోనే నార్మల్ డెలివరీ చేయడం జరిగినది.

ఆరోగ్యవంత ఆరోగ్యవంతమైన ఆడ శిశువు జన్మించినది తల్లి శిశువు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు . వీరి ఇరువురిని మెరుగైన చికిత్స గురించి ఆర్మూర్ ఏరియా హాస్పిటల్కు సురక్షితంగా తరలించి అడ్మిట్ చేయడం జరిగింది. శిరీష్తో పాటు ఉన్న వారి బంధువులు వారి భర్త 108 అంబులెన్స్ పనితీరును చాలా గొప్పగా ప్రశంసించారు.

MOST READ : 

  1. IIIT : భాసర ట్రిపుల్ ఐటీకీ ఆరుగురు విద్యార్థులు ఎంపిక..!

  2. KTR : కేటీఆర్ సంచలన సవాల్.. ప్లేస్, టైం, డేట్ అన్ని సీఎం రేవంత్ ఇష్టమే.. ఎప్పుడైనా రెడీ..!

  3. Rythu : రైతుల ఖాతాలలో రూ.7 వేలు జమ.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ కు చేరుతున్న వరద నీరు.. ఈసారి కూడా ముందస్తేనా..!

మరిన్ని వార్తలు