TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!
TG News : తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. 65 లక్షల మందికి కానుక..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా కానుక అందజేయాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు చీరల తయారీ కోసం ప్రభుత్వం 318 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది. ప్రస్తుతం 1.25 కోట్ల మీటర్లతో 20 లక్షల చీరల తయారీ పూర్తి అయినట్లు తెలుస్తుంది. మరో 45 లక్షల చీరల ఉత్పత్తి కొనసాగుతుంది. అందుకుగాను సిరిసిల్లలోని ప్రతిరోజు 5000 మంది కార్మికులు చీరల తయారీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దసరా నాటికి మొత్తం తయారీ పూర్తి చేయాలని ప్రభుత్వం వారిని ఆదేశించింది.
అదేవిధంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు శ్రీనిధి ద్వారా బీమా పథకాన్ని 2029 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తు మరణించిన మహిళలకు 10 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. దాంతోపాటు స్టాంప్ డ్యూటీ చట్టంలో భాగంగా మహిళలకు స్టాంప్ డ్యూటీని తగ్గించనున్నది.
ఈ వార్తలు కూడా చదవండి
-
CM Revanth Reddy : దేవుడినైనా ఎదిరిస్తా.. తెలంగాణ ప్రజల తరపున నిలబడతా..!
-
ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. లంచం తీసుకుంటూ దొరికిన టాక్స్ అధికారిని..!
-
Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
-
Holiday : నేడు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు.. సడన్ నిర్ణయం..!









