TG News : శ్రీమంతుడి సినిమా పాటతో ఆ మంత్రి సైకిల్ వీడియో వైరల్..!

TG News : శ్రీమంతుడి సినిమా పాటతో ఆ మంత్రి సైకిల్ వీడియో వైరల్..!
అందోలు, మనసాక్షి :
అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహా తాజాగా సైకిల్ ఎక్కి సరదాగా సవారీ చేస్తూ “కనిపించారు. అయితే ఇది ఉదయం ఎక్సర్సైజ్ కోసం చేసే సైక్లింగ్ కాదు.
గురువారం జెఎన్టీయూ కళాశాలలో పర్యటించిన సందర్భంగా జెఎన్ఎటీయూ విద్యార్థుల కోసం మంత్రి సహాకారంతో 100 సైకిళ్లను అందించిన సైకిళ్ల కండిషన్ ఎలా ఉంది అని సైకిల్ రైడింగ్ చేసి పరిశీలించారు. ఇలా కొద్ది దూరం సైకిల్ తొక్కి సైకిళ్ల కండీషన్ పై మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీమంతుడి సినిమా పాటతో మంత్రి సైకిల్ వీడియో వైరల్ అవుతుంది.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన, సామాన్య ప్రజలతో కలిసి మాట్లాడిన ఎప్పుడూ కెమెరాల వైపు పెద్దగా దృష్టి పెట్టకుండా తన పని తాను చేసుకుపోవడం ఆయన శైలి విధానం. తాజాగా మంత్రి సైకిల్ ఎక్కి సరదాగా కొద్ది దూరం సవారీ చేస్తూ కనిపించారు. మంత్రి సైకిల్ సవారీ చేసిన వీడియోలు ప్రస్తుతం స్థానికంగా కాంగ్రేస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
MOST READ :
-
Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!
-
UREA : కోళ్లకు వేసే ఆహార ధాన్యాలలో యూరియా.. అధికారుల ఆకస్మిక తనిఖీ..!
-
TATA AIA: ఎండీఆర్టీ ర్యాంకింగ్స్లో మరోసారి నంబర్ 1 స్థానంలో టాటా ఏఐఏ..!
-
Fake Certificates : నకిలీ సర్టిఫికెట్ల దందా.. SSC నుంచి BeTech వరకు, ఏదైనా సాద్యమే ఇక్కడ..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!









