Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : రూ.500 నోటు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ కు కారణం..!

Nalgonda : రూ.500 నోటు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ కు కారణం..!

మన సాక్షి, నల్గొండ :

ఇద్దరు కానిస్టేబుల్స్ మధ్య 500 రూపాయల పంపకాల్లో తేడా వారి సస్పెండ్ కు కారణమైంది. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ అయిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ ల సెటిల్మెంట్ల వ్యవహారం బయటకు పొక్కింది. దాంతో జిల్లా ఎస్పీ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన వాహనాలు అమ్ముతున్నారని సెటిల్మెంట్లు చేసి డబ్బులు దండుకుంటున్నారని తేలింది. తిప్పర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వసీం, ఉపేందర్ అనే ఇద్దరు కానిస్టేబుల్ లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ సస్పెండ్ చేశారు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ఇటీవల ఒక గుర్తు తెలియని బైకును మెకానిక్ వద్ద మరమ్మతు చేయించి ఒక వ్యక్తికి విక్రయించారు.

ఆ డబ్బు పంపకాల్లో ఇద్దరు కానిస్టేబుల్స్ మధ్య 500 రూపాయలు తేడా వచ్చింది. దాంతో విషయం అందరికీ తెలిసింది. కాగా తిప్పర్తి ఎస్ఐ శంకర్ ఎస్పీకి నివేదించారు. విచారణ చేపట్టిన ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

MOST READ : 

  1. Komatireddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్..!

  2. Good News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Karimnagar : వామ్మో.. ఈ దొంగ మామూలోడు కాదు..!

  4. Khammam : గిరిజన పాఠశాలలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత..!

  5. Sub Collector : మదనపల్లె సబ్ కలెక్టర్ గా ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు