Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసినిమాహైదరాబాద్

Hyderabad : భార్గవి పిళ్ళై పాటల హోరుతో మార్మోగిన అపర్ణా నియో మాల్..!

Hyderabad : భార్గవి పిళ్ళై పాటల హోరుతో మార్మోగిన అపర్ణా నియో మాల్..!

హైదరాబాద్, మన సాక్షి:

అపర్ణా నియో మాల్‌లో జరుగుతున్న NEOSS షాపింగ్ ఫెస్టివల్లో తొలిసారిగా ఒక సెలబ్రిటీ కార్యక్రమం జరిగింది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిళ్ళై తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆమె లైవ్ పర్ఫార్మెన్స్ చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులతో మాల్ మొత్తం సందడిగా మారిపోయింది. పాటలు, డ్యాన్స్‌లతో షాపింగ్ ఫెస్టివల్ మరింత కళను సంతరించుకుంది.

ఆగస్టు 17 వరకు జరిగే ఈ ఫెస్టివల్‌లో షాపింగ్ చేసేవారికి బంపర్ ఆఫర్లు, లక్కీ డ్రాలు ఉన్నాయి. ₹1,000 అంతకంటే ఎక్కువ షాపింగ్ చేసినవాళ్లు లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఇక ముందు కూడా ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలు జరగనున్నాయి.

ఆగస్టు 14-15 తేదీల్లో జానపద నృత్యాల ఫెస్టివల్ (Folk Dance Fest), ఆగస్టు 16న అద్భుతమైన శాండ్ ఆర్ట్ ప్రదర్శన (Sand Art performance) వంటివి ఈ ఈవెంట్లలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈసారి సిటీలో జరుగుతున్న అత్యంత డైనమిక్ షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్‌గా ఇది నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

MOST READ : 

  1. Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!

  2. Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..! 

  3. Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!

  4. Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!

  5. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

మరిన్ని వార్తలు