Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లారాజకీయం

Godavari : ఎడారిలా మారిన గోదావరి.. నది ఇసుకలో ఆటలాడుతూ నిరసన..!

Godavari : ఎడారిలా మారిన గోదావరి.. నది ఇసుకలో ఆటలాడుతూ నిరసన..!

గోదావరిఖని, మన సాక్షి :

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రైతంగానికి సాగునీరు ఈ ప్రాంతానికి త్రాగునీరు అందించాలన్న మహ సంకల్పం తో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరి నదిని నిండుకుండలగా మార్చి రైతుల కన్నీళ్లు తుడిచారని… 20 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతంగానికి సాగునీరు అందించక రైతుల కంట కన్నీరు పెట్టిస్తూ రెవంత్ సర్కార్ అరిగొస పెడుతుందని…

గొదావరి నదిని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణ శివారు గోదావరి నది ఇసుక లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఇసుకలో బీఆర్ఎస్ నాయకులు క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేసీఆర్‌ పాలనలో కేసీఆర్ సీఎంగా కొనసాగిన సమయంలో గోదావరి నిండుకుండగా ఉండేదని కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత నిండుకుండలా ఉన్న గోదావరి ఎడారిలా మారిందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు కల్వచర్ల కృష్ణ వేణీ , గాదం విజయ బాదె అంజలి టిబిజికఎస్ నాయకులు పర్లపల్లి రవి నూనె కోమురయ్య వడ్డెపల్లి శంకర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చే వేణు, తోకల రమేష్, చెలకలపల్లి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, కాల్వ శ్రీనివాస్, పీచర శ్రీనివాస్, జక్కుల తిరుపతి అల్లం అయులయ్య,

కేశవ గౌడ్, ఇరుగురాళ్ల శ్రావన్, చింటూ, సట్టు శ్రీనివాస్, కలవేని రవీందర్ , భాను చందర్, నూతి తిరుపతి, గంపుల లక్ష్మి, ఆర్శనపల్లి శ్రీనివాస్, బండారి ప్రవీన్, గుర్రం పద్మ , సూజాత లక్ష్మి,  బుర్ర వెంకటేష్, ఆవునూరి వెంకటేష్, కిరన్ జీ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Sangareddy : రోడ్డు సౌకర్యం లేక దీనస్థితి.. బాలింతను రెండు కిలోమీటర్లు వీపుపై మోసుకెళ్లిన 108 సిబ్బంది.. (వీడియో)

  2. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  3. Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!

  4. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!

  5. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

మరిన్ని వార్తలు