Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
నల్లగొండ/ కేతేపల్లి, మన సాక్షి :
మూసి నీటి ప్రవాహం వల్ల నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం వద్ద ఉన్న లో లెవెల్ కాజ్ వే పై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి మూసి డ్యామ్ ను సందర్శించారు.
నీటిపారుదల శాఖ ,ఇంజనీరింగ్ అధికారులతో మూసి ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, అలాగే ప్రాజెక్టు వద్ద ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా గేట్లకు సంబంధించి, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు .
ప్రస్తుతం ప్రాజెక్టు నుండి బయటికి పంపిస్తున్న నీటి వివరాలను అడగగా 13000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలు కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామం వద్ద ఉన్న లో లెవెల్ కాజ్ వే ను తనిఖీ చేశారు.మూసి నుండి ఎక్కువ నీరు విడుదల చేసినా, లేదా ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షం కారణంగా నీటి ప్రవాహం ఎక్కువైతే కాజ్ వే పై నుండి నీరు ప్రవహిస్తుందని, 20 వేల క్యూసెక్కులు మూసి నుండి వదిలినప్పుడు మాత్రమే సమస్య ఉత్పన్నం అవుతుందని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ విషయం పై జిల్లా కలెక్టర్, ఎస్ పి లు స్పందిస్తూ భీమారం లో లెవెల్ కాజ్ వే గుండా ప్రయాణం చేసే వారిని అవసరమైతే ముందుగానే అప్రమత్తం చేయాలని,భీమారం, కొప్పోలు నుండి రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ప్రవాహం పెరిగినప్పుడు అవసరమైతే కాజ్ వే పై రాకపోకలు నిలిపివేసి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మూసి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ .వెంకటరమణ, డిఇ చంద్రశేఖర్, జేఈ లు కీర్తి,కేతేపల్లి డి ఇ వాణి, ఎంపిడిఓ శ్రీనివాస సాగర్, తహసిల్దార్, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!
-
District collector : కొడుకు తిండి పెట్టడం లేదని జిల్లా కలెక్టర్ కు వృద్ధురాలు ఫిర్యాదు.. స్పందించిన జిల్లా కలెక్టర్ ఏం చేసిందంటే..!
-
Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!
-
Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!
-
Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!









